Thursday, September 15, 2016

అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.( సంకీర్తన) .

అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.( సంకీర్తన)

.

శంకరాభరణం.

పల్లవి:

ఉయ్యాలా బాలునూఁచెదరు కడు

నొయ్య నొయ్య నొయ్యనుచు

చరణములు:

బాలయవ్వనలు పసిఁడివుయ్యాల

బాలుని వద్దఁ బాడేరు

లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల

లాలి లాలి లాలనుచు

తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల

పమ్ముఁ జూపులఁ బాడేరు

కొమ్మలు మట్టెల గునుకుల నడపుల

ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లుఁ జూపుల జవరాండ్లు రే

పల్లె బాలునిఁ బాడేరు

బల్లిదు వేంకటపతిఁ జేరి యందెలు

ఘల్లు ఘల్లు ఘల్లనుచు

No comments:

Post a Comment