Tuesday, September 13, 2016

-కరుణశ్రీ గారి మందార మకరందాలు - . పుష్పవిలాపము.

-కరుణశ్రీ గారి మందార మకరందాలు - 

.

పుష్పవిలాపము.

ఉ.

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో

రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి "మా

ప్రాణము తీతువా" యనుచు బావురుమన్నవి - క్రుంగిపోతి - నా

మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.

ఉ.

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తుము - తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై

నూయల లూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే

హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.

ఉ.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం

గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే

త్రాలకు హాయి గూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో

తాళుము త్రుంపబోవకుము ! తల్లికి బిడ్డకు వేఱు సేతువే !

No comments:

Post a Comment