ముక్తి మార్గం — .

ముక్తి మార్గం —
.
శ్రీకృష్ణుడు పుట్టింది దేవకీ దేవి ,వసుదేవుల కైనా, పెరిగింది గొల్లపల్లె లోయశోద నందుల వద్దే!
ఆబాలగోపాలుడు చేసిన అల్లరి ఇంతింతని చెప్పలేము. తల్లి యశోద తో పాటుగా గోపకాంతలంతా విసిగి వేసారి పోయేవారు.గోపాలునికి వారినంతా విసిగించడం అదోసరదా ..ఒక మారేమైందంటే బాలకృష్ణుడు తన సావాసగాళ్ళనంతా పోగేసుకుని గోపకాంతలు ఇళ్ళలో లేని సమయంలో వెళ్ళి అందరి ఇళ్ళలోని పాలు ,పెరుగు,వెన్నతన దోస్తులకంతా పంచి ,తిన్నంత తిని వారి బానలన్నీపగులగొట్టివచ్చేవాడుట!.
ఆ గోపకాంతలంతా యశోద వద్దకు వచ్చికృష్ణుడు చేసిన అల్లరిని ఇలాచెప్పుకుంటారు.
” ఓయమ్మనీకుమారుడు మా ఇళ్ళను పాలు,పెరుగు మననీడమ్మా! పోయెదమెక్కడికైనను మా అన్నలసురభులానమంజులవాణీ! —
అంటూ తమ అన్నల గోవులపైఆనచేసి ,బాలకృష్ణుడు తమ ఇళ్ళలోదూరి, పాలూ,పెరుగు తాగినంతతాగి తమబానలన్నీపగులగొట్టి తమనెలా ఇబ్బందిపెడుతున్నాడోచెప్పి,
‘ఇహఇక్కడఉండలేము, ఎటన్నావెళ్ళిపోతామని’చెప్పగానే , యశోదకు కృష్ణునిపై చాలా కోపం వస్తుంది. ఆమె గోప కాంతలనంతాబ్రతిమాలి పంపేస్తుంది.
తన బిడ్డపై తనతో నేరాలుచెప్పిన గొల్లపడుచులు వెళ్ళగానే , కృష్ణుని పట్టి బంధించాలని పట్టుకోబోయింది యశోద .
కృష్ణుడు వడి వడిగా కాళ్ళ అందెలు మ్రోగుతుండగా తల్లి యశోదకు అందకుండా పరుగెత్తసాగాడు.వ్రేపల్లె వీధులన్నీతిరిగి,తిరిగి యశోదఅలసిపోయింది .వేగం తగ్గించి మెల్లగా నడవసాగింది.కృష్ణుడు ఊరి చివర ఉన్నఒక కుండలు చేసి అమ్ముకునే కులాలుని ఇంటజొరబడి, అతడు తయారు చేసిన పెద్ద బాన అడుగునదూరుతాడు. అది గమనించిన ఆకులాలుడు ఎంతో కాలంగా తనకున్న కోరిక నెరవేర్చుకోవాలని తలచి,ఆ బానపై కూర్చుంటాడు.
ఆకులాలుడు ఒక గొప్ప కృష్ణభక్తుడు! ఎంతోకాలంగాకృష్ణనామంజపిస్తూ ఆయన రాక కోసం కాచుక్కూచునుంటాడు.యశోద కృష్ణుని జాడకానకవెనక్కు తన ఇంటికి వెళ్ళిపోతుంది.’
భోజనం వేళకు ఇంటికి రాకపోతాడా!చూద్దాం,అప్పుడు పట్టుకుని రోటికి కట్టేస్తాను, మరి తప్పించుకోలేడు’అనుకుంటుంది ఆమె. ఇక్కడ బాలకృష్ణుడు బాన అడుగున పట్టుబడిపోయాడు.
లోపలినుండీ” కులాలా! బాన పైనుండీలే!నన్నుఇంటికి వెళ్ళనీ, మాఅమ్మ నా కోసంవెతుకుతున్నది ” అనిఅడుగుతాడు.
బాన పై ఉన్నకులాలుడు” నేనులేవను “అంటాడు .
” నన్నుఇంటికివెళ్ళనీలే !లే !” అనిఅడిగాడుమరలాకృష్ణుడు. కుమ్మరి” లేదులేదు, నేను లేవను గాక లేవను ” అన్నాడుమొండిగా .
” కులాలా !లే నన్నుపోనిమా అమ్మ దిగులు పడుతుంది నాకోసం” దీనంగా అడుగుతాడు కృష్ణుడు.
” మరి నేనడిగినదానికి సరేనంటే నేలేస్తాను.”
కుమ్మరిఒకతిరకాసుపెడతాడు. ” అలాగే నీవు ఏమి అడిగినా ఇస్తానుసరా! మరిలే!నీకేం కావాలో అడుగు” “భగవాన్ముక్తినిప్రసాదించు” అని కోరాడు కులాలుడుబాన పైనుండీ లేవకుండానే! .
అప్పుడుకృష్ణుడు” సరే! అలాగే నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను .ఇకలే బానపైనుండీలేచి ,నన్నుబయటికిరానీ ” అన్నాడు. కులాలుడుమొండిగా” కృష్ణా ! నాకే కాదు ఈబానకూ ముక్తి ప్రసాదించులేకపోతే నేను బానపైనుండీ లేచేది లేదు.ఈ బాన వల్లనేకదా నాకు ముక్తి లభించింది.
అందు వల్ల బానకూ ముక్తినివ్వు.అప్పుడు కానీ లేవను”అన్నాడుమొండిగా. కృష్ణుడు ఇహ తప్పక ,తాను మాట ఇచ్చాడు గనుక
” సరే! అలాగే నేను ఈబానకూ ముక్తిని ప్రసాదిస్తున్నాను, ఇహలే, బానపైకెత్తు, నేను బయటికి వస్తాను.” అనగానే కులాలుడు లేచి బానను పైకెత్తాడు.
చూశారా! ఉత్తములు తమకేకాక తమముక్తికి సహకరించిన వాటి ముక్తి కోసం కూడా ప్రయత్నిస్తారు. అందుకే పెద్దలు ఉత్తములతో మైత్రిచేయమని చెప్తారు. నీతి:-సహవాసం మంచిదైతే మనకు మంచేజరుగుతుంది.
అందుకేస త్సంగం అన్నారు. . -

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!