Wednesday, September 14, 2016

పాట పాడుమా కృష్ణా....లలిత గీతం సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు

లలిత గీతం

సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు

పాట పాడుమా..ఆఅ..

పాట పాడుమా కృష్ణా

పలుకు తేనె లొలుకు నటుల

మాటలాడుమా ముకుందా

మనసు తీరగా...ఆఆఅ...

శ్రుతిలయాదులన్ని చేర్చి

యతులు నిన్ను మదిని తలచె..ఏ..

శ్రుతిలయాదులన్ని చేర్చి

యతులు నిన్ను మదిని తలచె

సదమల హృదయా నిన్ను

సన్నుతింతు వరనామము

పాట పాడుమా కృష్ణా

పలుకు తేనె లొలుకు నటుల

మాటలాడుమా ముకుందా

మనసు తీరగా

సామవేద సారము

సంగీతము సాహిత్యమెగా..ఆఅ..

సామవేద సారము

సంగీతము సాహిత్యమెగా

దానికంతమగు గానము

పాటకూర్చి పాడుమా

పాట పాడుమా కృష్ణా

పలుకు తేనె లొలుకు నటుల

మాటలాడుమా ముకుందా

మనసు తీరగా...ఆఆ..ఆ..

(ఈ వీడియో నేను స్వయంగా చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను.)

No comments:

Post a Comment