Tuesday, September 13, 2016

ముద్దుల నా యెంకి..యెంకి పాటలు నండూరి సుబ్బారావు!

యెంకి పాటలు నండూరి సుబ్బారావు!

.

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

.

కూకుండ నీదురా కూసింతసేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది

.

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది

.

దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

యీడుండ మంటాది యిలుదూరిపోతాది

.

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

మందో మాకో యెట్టి మరిగించినాదీ

.

వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

No comments:

Post a Comment