-భోగినీ దండకము

-భోగినీ దండకము

బమ్మెర పోతన-.. ఇది పోతనామాత్యుడు రాసినది కాదు.. ఎవరో రాసి అయన పేరు పెట్టేరు

అని నా నమ్మకం... ఇది పోతనగారి సైలి కాదు.

.

**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**

.

శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

*

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి..

రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!