పోతన గారి పద్యం..........బాపు గారి చిత్రం...!.

పోతన గారి పద్యం..........బాపు గారి చిత్రం...!.

"ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.".

భావము:

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; 

అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; 

పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; 

అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; 

మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం 

అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; 

ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో 

శ్రీమన్నారాయణ మహా ప్రభువు.!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!