ఆధ్యాత్మిక జ్ఞానం !

ఆధ్యాత్మిక జ్ఞానం !

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నారు 

శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. 

మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. 

.

అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? 

అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు.

దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన ఈ పద్యంలో.

చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు

కడకు మొదటి కులము చెడినయట్లు

పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!

విశ్వదాభిరామ వినురవేమ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!