నీతో ఒక గంట చాలు… సర్ వాల్టర్ స్కాట్.

నీతో ఒక గంట చాలు… సర్ వాల్టర్ స్కాట్.

.

నీతో ఒక గంట చాలు!

ప్రాభాతసంధ్య తూరుపు నీలితెరలపై

బంగారు వన్నెలు అద్దుతున్నప్పుడు

నీతో ఒక్క గంట చాలు!

ఇక రోజులో రాబోయే కష్టాలనీ, కన్నీళ్ళనీ

శ్రమనీ, సంక్షోభాల్నీ

బాధలూ, వాటి జ్ఞాపకాలనీ మరిచిపోకుండా

నన్నేదీ కట్టిపడెయ్యలేదు!

నీతో ఒక గంట చాలు!

.

మండువేసవి మధ్యాహ్న సూర్యుడు

ప్రచండంగా ప్రకాశిస్తున్నప్పుడు

చల్లని చెట్టునీడకంటే, సేదదీర్చే కొండవాలు కంటే

పొలంలో నమ్మకంగా పాటుపడుతున్న రైతుకి

శ్రమకుతగ్గ ప్రతిఫలం ముట్టజెప్పగలిగిన దెవ్వరు?

నీతో ఒక్క గంట చాలు!

ఆహ్! నీతో ఒక్క గంట చాలు!

.

సూర్యుడు అస్తమించిన తర్వాత…

ఆశల్నీ, కోరికల్నీ విసర్జించి

రోజల్లాపడ్డ నిరుపయోగమైన శ్రమనీ,

పెరుగుతున్న అవసరాలనీ, తరుగుతున్న ఫలితాల్నీ,

యజమాని అహంకారాన్నీ, గుర్తించని కష్టాన్నీ

మరిచిపొమ్మని ఇంకెవరు బోధించగలరు?

నీతో ఒక్క గంట చాలు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!