సరస్వతీ ప్రస్తుతి-అల్లసాని పెద్దన !

సరస్వతీ ప్రస్తుతి-అల్లసాని పెద్దన !

.

చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే

సిందూర తిలకంబు చెమ్మగిల్ల

నవతంస కుసుమంబునం దున్న యెలదేఁటి

రుతి కించిదంచిత శ్రుతుల నీన

ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ

దుంబీఫలంబు తుందుడుకుఁ చెంద

దరుణాంగుళిఛ్ఛాయ దంతపుసరకట్టు

లింగిలీకపు వింతరంగు లీన

.

నుపనిషత్తులు బోటులై యోలగింప

బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి

నించు వేడుక వీణ వాయించు చెలువ

నలువరాణి మదాత్మలో వెలయుఁగాత!

.

తన పాపట బిళ్ళగా అలంకరించుకున్న జాబిల్లి యొక్క వెన్నెలల చెమ్మ వలన తన నుదుటి సిందూరము చెమ్మగిల్లుతుండగా, సిగలోనున్న పుష్పములోనున్న తుమ్మెద చేస్తున్న సన్నని రొద తన వీణా నాదానికి శృతి పడుతుండగా, 

ముందుకు వంగుతూ, వాలుతూ వీణను వాయిస్తూవుంటే విశాలములైన వక్షోజముల రాపిడికి సొరకాయ బుర్ర లాంటి వీణ దిమ్మ ‘దిమ్మ తిరిగి’ తొట్రు పడుతుండగా,

తన వ్రేళ్ళ ఎర్రదనమూ దంతముతో చేసిన వీణ మెట్ల తెల్లదనమూ కలసిపోయి కించిత్తు ఎర్రని ‘ఇంగిలీకపు’ రంగులో వింత కాంతులు వెలయిస్తూ ఉండగా,

ఉపనిషత్తులు చెలికత్తెలై, సేవకురాండ్రై సేవలు చేస్తుండగా, 

తెల్ల తామర పూవులో కూర్చుని మనసుకు హాయిగొల్పుతూ వీణ వాయిస్తూ ఉన్న నలువరాణి, బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీ మాత 

నా ‘ఆత్మలో’ వెలయుగాక!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!