ఒక్కో దీక్ష- ఒక్కో మంత్రం- ఒక్కో ధ్యాన శ్లోకం !




-

ఒక్కో దీక్ష- ఒక్కో మంత్రం- ఒక్కో ధ్యాన శ్లోకం !

.

ఒక్కో దీక్ష, ఒక్కో మంత్రం, ఒక్కో ధ్యాన శ్లోకం, 

ఒక్కో మూర్తి ఒక్కో సాధన కోసం ప్రత్యేకంగా చెబుతారు....

అన్నీ కలగాపులగం చేయకూడదు....

భవానీ దీక్ష వేరు, భ్రమరాంబికా దీక్ష వేరు....బీజాక్షరములు వేరు...

కోర్కెలు వేరు....అంతా ఆ పరాశక్తి రూపములైనా ప్రకటిత రూపములు 

ఓక్కో కార్య సిద్ధికి మాత్రమే చెప్పబడినవి....

ఓక్కో రాత్రి ఒక్కో శక్తిని ఆరాధిస్తూ ప్రకృతికి మూలమైన శక్తులను 

మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిని చివరి మూడు రోజులు,

మూడు రాత్రులు త్రివార దీక్షతో మూలా నక్షత్రం నుంచి కొలవడం 

శిష్టాచారం.

ఉదయం నుంచి ఉపవాసం వుండి, ఉదయం పూట వేళల్లో అభిషేకం, పారాయణాదులు చేసుకొంటూ, సాయంత్రం చీకటి పడిన తరువాత అమ్మ వారిని కళశారాధన చేస్తూ, షోడషోపచారములతో పూజించడం, 

లలితా సహస్రనామములు చదువుకోవడం....శారదా నవరాత్రుల ప్రత్యేకత....

ఏవీ చేయలేని వారు కనీసం దీపారాధన చేసి లలితా సహస్రనామములు చదువుకోవడం చాలా మంచిది....

కళశారాధన వేరు, మామూలు మూర్తులకు అలంకరణ చేయడం వేరు....

అంటే కలశం పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు అవసరం.....మామూలు బిందె పెట్టి చేసే అలంకరణ లకు మన ఇష్టం వచ్చినట్లు అలంకరణలు చేసుకోవచ్చును....

కలశం అంటే చెంబు మీద టెంకాయి బెట్టి వారి వంశానుచారముగా, 

శాస్త్ర ఆధారముగా పెట్టి చేయవలయును....

మంత్ర యుక్తముగా చేయవలయును.....సందేహములున్నచో 

అడుగ వచ్చును.

(ఓకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది.).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!