అప్రస్తుత ప్రసంగం!

.

.

అప్రస్తుత ప్రసంగం!

.

ఓ అవధానిగారికి నెత్తి మీద జుట్టు పల్చగా ఉంటుంది. ఆయనకు దాన్ని మాటి మాటికీ దువ్వుకోవడం అలవాటు. 

అది చూసిన అప్రస్తుత ప్రసంగం వారు ఆ అవధానిని ఆట పట్టిస్తూ ' ఆ వున్న నాలుగు పుంజీల వెంట్రుకలు మాటి మాటికీ దువ్వాలేమిటి ? ' అని ఆక్షేపించాడు.

దానికా అవధాని గారు " నీకేం తెలుస్తుంది నాయనా నా బాధ ! నలభై ఎకరాలున్న వాడు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఫర్వాలేదు. నాలుగు ఎకరాలే ఉన్నవాడు కొంచెం వెనుకా ముందూ ఆలోచించి జాగ్రత్తగా ఆ ఉన్న వాటిని కాపాడుకోవాలి. నా పరిస్థితీ అంతే ! " అన్నారు

.

కిర్తిశేషుల పెళ్ళీ 

.

"అయ్యా ! నాకో శుభలేఖ వచ్చింది. కీర్తిశేషులిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు. నన్ను రమ్మని ఆహ్వానించారు. వెళ్ళమంటారా ? " అని అడిగాడొక పృచ్చకుడు ఒక అవధానంలో . దానికి సమాధానంగా అవధానిగారు " తప్పకుండా వెళ్ళండి" అని

ఆగారు. 

అందరూ ఆశ్చర్య పోయారు. ఏమిటీయన కీర్తిశేషుల పెళ్ళీ అంటే వెళ్ళమంటాడు. స్వర్గానికి వెళ్ళమనా అని అందరూ అనుకుంటుండగా 

' అమ్మాయి పేరు కీర్తి. అబ్బాయి పేరు శేషు. 

వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటుంటే వెళ్ళడానికి మీకభ్యంతరం ఏమిటి ? " 

అనగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!