-

భాస్కర శతకము - మారవి వెంకయ్య !

_

"ఒక్కడె చాలు నిశ్చలబలోన్నతు డెంతటి కార్యమైనఁ దాఁ

జక్కనొనర్పఁ, గౌరవు లసంఖ్యులు బట్టిన ధేనుకోటులం

జిక్కగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్

మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్క కిరీటి! భాస్కరా!

.

భావము: 

"ఎంత గొప్ప కార్యమునైనా చక్కగా నిర్వహించుటకు సమర్థుడైన వీరుడు

ఒక్కడుంటే చాలును. "మహాభారతము" లో ఉత్తరగోగ్రహణ సమయమున కౌరవులు తమ అసంఖ్యాకమైన సేనాబలముతో విరాటనగరముపై దండెత్తి, ఆ రాజు యొక్క గోసంపదను అపహరింప తలపెట్టినప్పుడు, కేవలం ఏకాకియైన విజయుడు తన బాణవర్షముతో యోధులైన కురువీరులందరినీ చీకాకుపరచి, ఆ గోధనమును రక్షింపలేదా!" 

అంటున్నాడు కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!