Wednesday, October 4, 2017

సామజిక దృక్పధం !-

సామజిక దృక్పధం !


-

గ్రామం లో కి వెళ్లి ఒక రైతు ని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి . వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు . పట్టణం లో వెళ్లి ఒక హోటల్ యజమాని ని అడగండి .. కూక్స్ వైటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు ." అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది .. లేక పొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు . భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు . నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పురోహితుడు , కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడిగారు .

ఒక పక్క దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు . మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు . ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి .

హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది . అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు .

సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి . జీతం ఎక్కువ వస్తుంది అని కాదు . చాల సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది . ఈ రోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు . అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు . మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు . ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని. ప్లంబర్ ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి . అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది . అయినా పురోహిత్యం అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి . కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు . అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ . తల తీసి నట్టు ఫీల్ అవుతారు . ఇదే మన వారు అమెరికా కు వెళితే అక్కడ హోటల్ లో పని చెయ్యడానికి సిద్ధ పడుతారు.

అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం . దొంగ తనం , అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు . అన్ని పనులు గొప్పవే . మన సీనియర్స్ అమెరికా వెళ్లారు .. మనకు ట్రంప్ అడ్డుపడ్డాడు .. ఇక్కడ ఉద్యోగం లేదు ... దారిన పొయ్యే వారు ఎం బాబు ఉద్యోగం లేదా అంటూ కాకుల్లా పొడుచుకొని తింటున్నారు అని ఫీల్ కానక్కర లేదు .

మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి . అతి చిన్న ఉద్యోగమైనా పరవా లేదు . చేతినిండా పని ఉండాలి ... ఎంతో కొంత ఆదాయం ఉండాలి . చేస్తున్న పని పై మనసు లగ్నం చెయ్యాలి . అంచెలంచెలుగా ఎదగాలి . పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి . పాన్ డబ్బా పెట్టుకొన్న పరవా లేదు . కర్రీ షాప్ పెట్టుకొన్న పరవా లేదు . మీరే రాజు. .. మీరే మంత్రి ... డిప్రెషన్ శుద్ధ అనవసరం . ఆత్మ విశ్వాసం ... కృషి .. పట్టుదల .. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం ... కావలసింది ఇది . వీడియో గేమ్స్ ఆడుతూ ... కాల్సక్షేపం కోసం నెట్ పై సంచరిస్తూ .. ట్రంప్ కరుణిస్తాడు ... అవకాశం వస్తుంది అని చూడ్డం కాదు ... అవకాశాన్ని వెతుకొంటూ మీరే వెళ్ళాలి . ఒకటి చెప్పనా ... అమెరికా లో వెళ్ళగానే ఏదో భువిలోక స్వర్గం సాక్షత్కారం కాదు . అంతకు పది రెట్లు ఇక్కడే హ్యాపీ గా బతక వచ్చు . ఎక్కువ చెబితే అక్కడ ఉన్న మిత్రులు ఫీల్ అవుతారు . వద్దు లెండి.. అక్కడి అవకాశం వస్తే వెళ్ళండి ... కానీ దాని కోసమే ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు .

జీవితం లో స్థిరపడి పొయ్యారు ... మీరు ఏదైనా చెబుతారు అనుకొంటున్నారా ? మల్లి జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చెయ్యాల్సి వస్తే సిటీ లో ఒక మూల లక్ష ఖర్చుతో చిన్న రెస్టురెంట్ పెట్టి నేను కుక్ చేసి .. తింటే ఇక్కడ తిండి తినాలి అని లెవెల్ కు తీసుకుని వెళుతా . గ్రోత్ ఎలాగూ వస్తుంది . ఎందుకంటే నేను డబ్బు వెనక పరుగెత్తను. పని వెంట నాణ్యత వెంట పరుగెత్తుతా. చేసే పని ని ఎంజాయ్ చేస్తా ... నా వంట తిన్న వారి ఆనందం నాకు ముఖ్యం .. పేరు డబ్బు చచ్చినట్టు వెనక వస్తుంది .. రాక ఎక్కడ చస్తుంది . వంద శాతం నిజాయతి గా గుండెల పై చెయ్యి వేసుకొని చెబుతున్న మాట .

No comments:

Post a Comment