మా పని కాదు….

మా పని కాదు….

-

ఒక మహిళ సీరియస్ గా న్యూస్ చూస్తుంటే ..అవిడ తోటికోడలి పాప వచ్చి, పిన్ని న్యూస్ అబ్బాయిలు కదా చూస్తారు,నువ్వు చూస్తున్నవేంటి అని అడిగింది..

ఆ చిన్నారి మనసులో ఇంతటి అభిప్రాయం ఎలా కలిగిందో అని నాకు చాల అశ్చర్యం వేసింది.

అవును మరి తాతయ్య,నాన్న ఎప్పుడు టీవీ చూస్తుంటారు.నానమ్మ,అమ్మ వంటింట్లో పని చేసుకొంటూ ఉంటారు. ఒకవేల టీవీ చూసే అవకాశం వచ్చినా ఏ సీరియలో చూస్తుంటారు.న్యుస్ చూడటం, పేపర్ చదవటం ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, అది మగవాళ్ళు మాత్రమే చేసేది కాదమ్మా అని నచ్చ చెప్పాను.

ప్రతి చిన్న విషయానికి మొగుడి మీద ఆధార పడటం ఏదొ గొప్పగా భావిస్తూ ఉంటారు కొంత మంది మహిళలు. చదువుకోని వాల్లంటె కాస్త అర్ధం ఉంది, చదివి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా ఏమి తెలియనట్టు ఇలా అధారపడటం విడ్డూరంగా ఉంటుంది.సహజంగానె ఆడవారికి, మగవారి టేస్ట్లు ఇంటరస్ట్లు భిన్నంగా ఉంటాయి. అవి అభిరుచుల వరకు ఐతె పర్వాలేదు. మగవారు స్పోర్ట్స్ చూస్తే, ఆడవాలు వంట-వార్పు లేక కుట్లు నేర్పే ప్రొగ్రాం చూడొచ్చు. దీనివల్ల ఎవరికి నస్టం లేదు. కాని, ఇలా దైనందిన జీవితంలో కాస్త కామన్ సెన్స్, ఇంటరెస్ట్ ఉంటె తెలుసుకునే వాటికి కుడా, మాకు చేత కాదు అని చేతులు ఎత్తెయడం ఆడ వాళ్ళ పై చిన్న చూపును కలగ చేస్తుంది.

భార్య సంపాదిస్తుంది, కాని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలొ, ఎలా దాచాలొ, ఇంకం టేక్స్ రిటర్న్ ఎలా ఫయిల్ చేయాలొ ఇలాంటివన్ని మగ వాళ్ళకి వదిలేయాల్సిన అవసరం లేదు.

ఇద్దరు ఆలోచించి నిర్ణయం తీసుకోడంలో తప్పు లేదు. కాని ఇదేదో నా పని కాదు-ఆయనే చూసుకుంటారులె అన్న ధోరణి మంచిది కాదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!