పాడు మందర దశరాజు ప్రాణం తీసిందోయ్ ఖూనీ , మర్డర్ ..

పాడు మందర దశరాజు ప్రాణం తీసిందోయ్ 

ఖూనీ , మర్డర్ ..

-

ధిమికిట వాద్య మృదంగ

బ్రహ్మానంద హరీ గజాననా

తాండవ నృత్య హరీ గజానన 

బల భీమా బలభీమా 

అపార తప గుణ మహిమా జననియ

జై వీరాంజనేయస్వామికీ జై

భక్తులారా 

శ్రీ మారుతీ మండలి స్థాపకులు చింతలపాటి ముద్దుక్రిష్ణయ్య మనమడు

నరసింహ స్వామి కుమారుడు అయినట్టి సీతారామాంజనేయులు రాసిన

నరనారీ తత్వాలు వినరండీ

వినండయ్యా వినండీ 

కొట్టవోయ్ గాలి గట్టిగా కొట్టు

నమ్మరాదురా నమ్మరాదురా 

నమ్మరాదురా రా..రా..

ఆడదాని నయవంచన చేసే ఆడదానిని

నమ్మి చెడనివారు ఇమ్మహిలో లేరు

మాయదారి ఆడదానిని నమ్మరాదురా

హహహహ పోతున్నావా నాన్సెన్స్ పో పో 

వాలు చూపుల మేలి పలుకుల వలలో పడ దోసి 

జిత్తులెన్నో చూపి మత్తుమందులేసి 

మాయదారి ఆడదానిని నమ్మరాదురా 

నమ్మరాదురా నమ్మరాదురా నమ్మరాదురా

హహాహహ మీరూ పోతున్నారా పోండి పోండి 

మహా భక్తులారా 

ఈ చింతలపాటి సీతా రామాంజనేయులు

ఎందుకయ్యా ఆడదానిని నమ్మరాదు అన్నాడు అంటే?

పాడు మందర దశరాజు ప్రాణం తీసిందోయ్ 

ఖూనీ , మర్డర్ ..

అతివ కైక శ్రీరామ చంద్రుని అడవికి పంపిందోయ్ 

పద్నాలుగేళ్ళు ,ఫోర్టీన్ ఇయర్స్ ..

పాడు చిత్రాంగి సారంగధరుని కాళ్ళు కోసినాదోయ్ 

కలికి అహల్య ఇంద్రుని ఒళ్ళూ కళ్ళు చేసినాదోయ్ 

చంద్రుడు చెడెరా ఆడదానిచే 

దేవేంద్రుడు చెడెరా ఆడదానిచే 

కౌరవ పుత్రులు చెడిరీ ఆడదానిచే

విశ్వామిత్రుడు చెడెరా ఆడదానిచే 

ఇంద్రుడు చెడెరా చంద్రుడు చెడెరా 

అందరు చెడిరీ ఆడదానిచే

ఆడదాన్నీ నమ్మకు నరుడా 

ఆడదాన్నీ నమ్మకు నరుడా 

ఆడదాన్నీ నమ్మకు నరుడా 

నమ్మకు నరుడా నమ్మకు నరుడా నమ్మకు నరుడా

నరుడా నరుడా నరుడా నరుడా

---తోలేటి,మాధవపెద్ది సత్యం,యస్వీ రంగారావు,గోవర్ధనం,సంఘం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!