ఏమి రామ కధ శబరి ..శబరి...ఏది మరి ఒక సారి !

-

ఏమి రామ కధ శబరి ..శబరి...ఏది మరి ఒక సారి !

.

భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి విన్నపంలో 

జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది. అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సులభంగా చెప్పిన ఈ పాట చూస్తే మనసు కరుణ ప్రాయంగా మారుతుంది.

ఏమి రామ కథ శబరీ, శబరీ

ఏదీ మరియొక సారీ

ఏమి రామ కథ – రామ కథా సుధ

ఎంత తీయనిదీ శబరీ – శబరీ || ఏమి రామ కథ ||

భక్త శబరి చిత్రంలో ఈ పాటలో రెండు దృశ్యాల చిత్రీకరణ దాగి ఉంది. శబరి రాముడికి ఎంగిలి చేసిన పళ్ళని సమర్పిస్తే – “అవి ఎంతో తీయగా ఉన్నాయి, ఏదీ మరియొక సారీ ” అంటూ అవి తినే రాముడు కనిపిస్తాడు. రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూసిన శబరి ఆనందం కనిపిస్తుంది. ఇది ఒక చిత్రం. రెండోది. రామా కథా మృతం – ఎన్ని సార్లు తాగినా దాహం తీరదు. ఇంకా ఆ సుధని సేవించాలానే మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇలా రెండు దృశ్యాల్ని నాలుగు వాక్యాల్లో కమనీయం గా చుట్ట గలిగిన ప్రతిభ ఈ పాటలో కనిపిస్తుంది.

సంపూర్ణ రామాయణం సినిమాలో “అదిగో రామయ్యా – ఆ అడుగులు నా తండ్రివి..” పాటలో రాముడి రాక కోసం పరితపించే శబరి ఆత్రుతని ఎంతో కమనీయంగా రాసారు.

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది.

ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది.

ఎందుకో – ఎందుకో – ప్రతీ పలుకూ ఏదో చెప్పబోతుంది.

వనము చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది.

ఉండుండీ నా వళ్ళు ఊగి ఊగి పోతుంది.

అదిగో రామయ్య – ఆ అడుగులు నా తండ్రివి,

ఇదిగో శబరీ శబరీ వస్తున్నదీ

రాముడొస్తాడన్న ఆశతో జీవించే శబరికి ఆయన రాక ముందుగానే ప్రకృతిలో 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!