సీతాయాణము!

సీతాయాణము!

(శ్రీ Jagannaath Iragavaram..గారి పద్యకవిత.)

సీసము 

వృక్షములు పెకిలించి కక్ష్యలోద్రిప్పుచు 

ఫలపుష్పపత్రముల్బాడుజేసె

పచ్చని వృక్షాల పరిఘలుగాజేసి

పశుపక్ష్యాదుల భయము పెట్టె

స్వాశ ఘోషధ్వని శాఖలకదిలించ 

ప్రమాదావనంబును పాడు జేసె

రణఘోష మించెడురవమునుజేసెను

కర్ణభేరిపగుల కర్కశునకు

ఆటవెలది

గుండెచేతబట్టి క్రూరుడు పనిచెను

లక్షమంది సైన్య శిక్షితులను 

మంత్రిసుతులబంపెమాయావి పిమ్మట

వారి మట్టు బెట్టెవానరుండు 

ఆటవెలది 

అస్త్రమిచ్చెబ్రహ్మ అసురుని కొమరుకు

ఇంద్ర జిత్తు యనెడు బిరుదువాని

కట్టు బడియెహనుమ క్షణకాల మందున

రావణుండుపిలిచి రచ్చ జేసె 

వచనము 

హనుమ రావణునకు చెప్పెను

సీసము

సుగ్రీవ సచివుడశూరుండ వీరుండ 

శ్రీరామదాసుడశీఘ్రగతుడ

పాతివ్రత్యంబున పడతులలోమిన్న

మాతసీతయన్నమక్కువేల

సందేశమిదియెమాసామ్రాజ్యనేతది

దూతనునేనుగ దురితమేల

మాతను కోరెడుపాతకంబేలను 

శరణాగతే రామ చంద్ర విభుడు

తేటగీతి 

మాత నర్పించి మారాము శరణు గోరు

అన్ని తప్పులు మన్నించు నున్నతుండు

వేరు మార్గము లేదిక వేదనేల 

ప్రభువు మాటను మన్నించ ప్రగతి నీకు

ఆటవెలది 

కపిని చంపుమనెనుకాముక కృద్ధుడు

తమ్ముడడ్డుచెప్పెదానవునకు

వలదు దూత జంపవధినాయకాగ్రణీ

దూత చంప కీర్తి దూర మగును

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!