శృంగారంలో జారుబాటులు!

-

శృంగారంలో జారుబాటులు!

---

నిజ జీవితంలో జారుబాటులు (తప్పులు ) పనికి రాకపోయినా,

శృంగారంలో మాత్రం జారుబాటులుంటే ఫర్వాలేదంటాడు.

యెవరూ? యింకెవరు? మన చేమకూర వేంకట కవే! 

విజయవిలాసం కావ్యంలో యెన్నిజారుబాటులు చూపించాడో చూడండి! మీకోసం యీపద్యం!

.

ఉ; శయ్యకుఁదార్పగాఁ దురుము జారె; నదంతట చక్కదిద్దబో , 

పయ్యెద జారె; నయ్యదరిపాటున నీవియు జారె: నచ్చటన్ 

తొయ్యలి సోయగంబు గని ,తోడనె కౌగిటఁ జేర్చె క్రీడి; యౌ 

"నెయ్యెడ మేలె గాంతురు; గణింపరు జాణలు జారుబాటులన్;

.

ఉలూచి, అర్జనుల పడకటింటి శృంగార ఘట్టం! 

అంతవరకూ వారిద్దరికీ వాదోపవాదాలు జరిగాయి. 

బ్రహ్మచర్యం పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాను ,యిప్పుడు నీతోప్రణయంకుదరదంటాడు క్రీడి. అదితీర్థయాత్ర,యిదిప్రణయయాత్ర,పెద్దతేడాలేదూ, 

యెక్కడైనా మునగటమేకదా! 

అక్కడనదిలో, యిక్కడ లావణ్యప్రవాహంలో, 

యీతవచ్చినవాడవు నీకేలభయం? అనితనదారికి తెచ్చుకొంది. అతనికీ ఆమెనుచూస్తే వదలాలనిలేదు. సరే కార్యంగంలోకిదిగాడు.

.

మెల్లగా ఆమెను తల్పంమీదకు లాగాడట! 

ఆలాగటంలో ఆమెజుట్టుముడి జారిపోయిందట!

పాపమామె దానిని సవరించేనెపంతో రెండుచేతులూ పైకెత్తింది.

అంతే పయ్యద జారిపోయింది.(వక్షస్సౌందర్యంబయటపడింది) 

దానిని సవరించే ప్రయత్నంలో చీర ముడి ఊడిపోయింది. 

యింకేముంది? ఆమెసౌందర్యమంతా క్రీడికి కన్నుల విందుగా మారింది. అబ్బా యేమిసౌందర్యం! అ

నిమెచ్చుకొని యామెను బిగి కౌలిలో బిగించి క్రీడి యామెను ఉక్కిరి బిక్కిరి చేశాడట!

.

యిక్కడ కవిగారు ఉలూచి ప్రదర్శనాన్ని, అర్జనుని సుదర్శనాన్ని ప్రశంసిస్తూనే యిలాఅంటున్నాడు. యిన్నిజారుబాటులు చేసిన ఆడదాన్నా అర్జనుడు మెచ్చుకోవటం? అనిమీరు ప్రశ్నిస్తారేమో? అదేంపొరపాటుకాదు,చాలా ఉచితమైనది.యెందుకంటే?" 

యెక్కడైనా సరే జాణలు మేలునేచూస్తారు.జారుబాటులుపరిగణింపరు."- అని;జాణ - అంటే బాగా ఆరితేరిన వారని అర్ధం.

అలాంటివారు చిన్నచిన్న తప్పులను యెన్నరు. వారికి కావలసినది సుఖానుభవం. అంతకు మించివిచారమును వారు చేయరనిభావము. శృంగారానికి యిలాంటి ప్పదర్శనాలు గుణములేగాని, దోషములు గావని రసాలంకార తత్వజ్ఙుల యభిప్రాయము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!