శ్రీ నాధ చమత్కృతి (ఆచార్య .. చొప్పకట్ల సత్యనారాయణ గారు.)


-

శ్రీ నాధ చమత్కృతి 

(ఆచార్య .. చొప్పకట్ల సత్యనారాయణ గారు.)

శ్రీనాధ మహాకవికి స్త్రీ లోలత, శృంగారప్రియత్వము హెచ్చని చరిత్ర కారులంటారు

.స్త్రీ సౌదర్యాన్ని ప్రశంసిస్తూ అనేకపద్యాలు ఆశువుగా, అప్రయత్న సిధ్ధితతో వెలువడేవి. 

అయితే నాకేనేమిటి?పరమేశ్వరునంతటివాడే స్త్రీ సౌందర్యానికి మురిసి అక్కడే

కాపుర ముంటున్నప్పుడు ,నేనోలెక్కా? అంటాడు. వినండి ఆపద్యం!

.

చ: తొలకరి మించు తీగె గతిఁ దోప దుకాణము మీదనున్న ఆ 

యలికులవేణితో, తములపాకుల బేరములాజబోయి , నే 

వలచుటకేమి? శంకరుని వంటి మహాత్ముడె లింగరూపుడై 

కలికిమిటారి గుబ్బ చనుగట్టుల సందున నాట్యమాడగన్!!

.

తములపాకులమ్మే దుకాణంలో ఉన్న మెరపుతీగవంటి ఆయువతిని నేనుమోహించటానికేమున్నది కానీ, "

.

సాక్షాత్తూ ఆపరమ శివుడే లింగరూపియై ఆసుందరి వక్షోజాలనడుమనాట్యమాడుట లేదా? అనిశ్రీనాధ కవి చమత్కారం!!

బాగుంది కదూ!!!

(చిత్రం...వడ్డాది పాపయ్యగారు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!