అజరామర సూక్తి!



-

అజరామర సూక్తి!

.

గృహం గృహమటన్ భిక్షుః శిక్షతే న తు యాచతే |

అదత్వా మాదృశో మా భూః దత్వా త్వం త్వాదృశో భవ ||

- అజ్ఞాత కవి

.

ఇల్లిల్లూ భిక్షాటనతో యాచించే యాచకుడు ఏమని సందేశ మిస్తున్నాడంటే ' మీరెప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి, నా లాగా గ్రహీతగా మారిపోవద్దు.'

.

'చేతులకు తొడవు అనగా ఆభరణము దానము' అన్నది ఆర్యోక్తి. ఇంకొక మాట కూడా వుంది

.

"దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనం

అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విధుః"

.

లేనివానికి ఇచ్చుట, పూజలేక ఉండిపోయిన లింగమునకు పూజచేయుట, తల కొరివి పెట్టె వారసుడు లేని మృతునికి దహన సంస్కారము చేయుట కోటి యజ్ఞములు చేసిన ఫలము నిస్తుంది అని.

అసలు జీవన గమనమునకు ఇచ్చుట పుచ్చుకొనుట రెండు చక్రాలు. ఇస్తేనే తీసుకొనుటకు అధికారమొస్తుంది.

.

ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మ అంటే పరమాత్మనే కదా . మరి పరమాత్మను సంతృప్తి పరిస్తే మనకు ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు. ఈ జీవన సత్య మొకటి గుర్తుంటే ప్రపంచము సౌఖ్యము సౌభాగ్యముతో నిండిపోదా !

.

నకర్మణా, నప్రజయా, నధనేన, త్యాగైనైకానామృతత్వ మానసుః- అని వేదవాక్యం! దానంగొప్పది. అది యమృతత్వమునకు దారిచూపును. ఇకభిక్షులవిషయం; వారు చేస్తున్నది భిక్షాటన కాదు. మనకుపదేశంచేయటమే!

-

యెవరికీ యింత పెట్టక నేనిలాగైనాను మీరు నావలెగావలదు. నలుగుర కింతబెట్టి మీవలెనే సుఖసంపదలతో నానంగింపుఁడని యాసందేశము!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!