పురుష సూక్తం !


-

పురుష సూక్తం:-

-

పురుష అనగా "తత్వం".(పురుషుడు అని అర్ధం కాదు.వివరించే అంశానికి రూపం లేదు.లేదా ఆ రూపాన్ని వివరించే సమానమైన ఉన్నతమైన నామం లేదు.పురుష అనేది శక్తి తత్వాన్ని చూపుతుంది).మనం ఈ భూమి పైకి రాక ముందు మన నివాసం అమ్మ.మన ఈ శరీరభాగాలు అమ్మ అందించిన వరాలు.అలాగే ఈ అనంత కోటి గ్రహనక్షత్ర సముదాయం అంత జగదాంబ నుంచి ఉద్బవించాయి.మనలోని ఈ బలానికి మూలం,కారణం అమ్మ ఎలా అవుతుందో!!!.ఈ సృష్టి యొక్క ఉత్పతి కి కారణం కూడా అమ్మే అవుతుంది!!!.ఈ సృష్టి ఆవిర్బావం వివరణ చేయాలంటే ఒక స్వరూపం కావాలి కనుక విశ్వమాత ఐన జగదాంబను శక్తితత్వంగా గ్రహిస్తున్నాను...పురుష సూక్తంలో పురుష అనే పదం శక్తి యొక్క స్వభావాన్ని,తత్వాన్ని తెలుపునది .ఈ చరాచర జగత్తుని నడిపిస్తున్న శక్తి స్వరూపం ఎలా ఉంటుంది???అని ప్రశ్నించుకుంటే. దానికి సమాధానం ఈ పురుష సూక్తం!!!.సమస్తం ఇందులో ఉంది.

-

(శ్లో)

హరి ఓం||

తచ్చం యోరావృనీ మహే|

గాతుం యజ్ఞ్యయా |

గాతుం యజ్ఞయ పతయే|

దైవీ స్వస్తిరస్తునః|

స్వస్తిర్మానుషేబ్యహ|

ఊర్ద్వమ్ జిగాతు భేషజం|

శంనో అస్తు ద్విపదే|

శం చతుస్పదె|

ఓం శాంతిశాంతిశాంతిహీ||

వివరణ:-అజ్ఞానం చేత కప్పివేయ్యబడి నిర్లక్షం చెయ్యబడిన ఈ విజ్ఞానాంశాన్ని భగవదనుగ్రహం కోసం ఆ స్వరూపం పైన భక్తి,ప్రేమా కలిగేవిధంగా తెలుసుకోవాలి అని నిర్నయించుకుంటూ,శ్లోకజనీత పదములకు అధిపతి వైన నీవు.ఈ శ్లొకార్దరూపం లోని వేడుకోలుకి ప్రసన్నమై నీ కృపాకటాక్ష వీక్షనాలతో నన్ను,ఈ ప్రపంచాన్ని,సమస్త జంతు పశు పక్ష్యాదులను రక్షిస్తూ.నీ అనుగ్రహం తో వాటిని ఆరోగ్యకరంగా ఉంచుము.

-

విరాట్స్వరూప వర్ణన ప్రారంభం:-

సహస్ర శీర్షా పురుషః|

సహస్రాక్షః సహస్రపాద్|

సభూమిం విశ్వతో వృత్వా|

అత్యద్ష్ట దశ అంగుళం||

వివరణ:-ఈ విశ్వం లోని గ్రహాలను,నక్షత్రాలను శిరస్సులుగా .నేత్రములుగా, పాదములుగా కలిగి వెయ్యి తలలు వేల కన్నులు,పాదాలు కలిగి ఉండి.వాటి ద్వారా ఈ ప్రపంచానికి దిక్కులు,ఆకాశం ను కలిగించి ఎల్లప్పుడు ఈ శక్తి స్వరూపం రక్షిస్తూ ఉంటుంది.ఈ శక్తితత్వం యొక్కరూపాలు పదివేళ్ళతో లెక్కపెట్టలేనన్ని సంఖ్యలో ఉంటాయి.

పురుష ఏ వేదాగం సర్వం|

యద్బూతం యత్ చ్చభావ్యం|

ఉతామృతత్వస్యేసానాహా|

యదన్నే నాతిరోహాతీ|

.

వివరణ:-ఈ శక్తి స్వరూపం లేక శక్తి తత్వం సర్వాన్ని ఆవరించి ఉండి..,. ఏదైతేజరిగిందో, ఏదైతే జరుగుతోందో ఇంకా ఏదైతే జరగబోతోందో అన్నింటికి ఆ శక్తియే కారణమై ఉంటుంది.

అన్నం నచ్చక పోయినంత మాత్రాన,తినకపోయినంత మాత్రాన అన్నపదార్దం విషతుల్యం అవ్వదు.నమ్మకపోయినంత మాత్రాన విజ్ఞానం అజ్ఞానం కానేరదు.

ఏతా వానస్య మహిమా|

అతోద్యయాగంశ్చ పురుషః|

పాదోస్య విశ్వా భూతాని |

త్రిపాదస్యామృ తందివి|

.

ఆ శక్తి తత్వాన్నికి గల బలం అంతం లేనిది.అంతం లేనట్టి ఆ శక్తి తత్వం ఎల్లప్పుడు విజయాన్నే పొందుతుంది.మహా విశ్వం అంతయు ఆ శక్తి నుంచి ఉద్భవించినదై.నాలుగు వంతులుగా విస్తరించి ఉంది,అందులో ఒక వంతు మన భూలోకం గాను.మిగిలినవి మూడు వంతులు మూడులోకాలగాను ఉద్భవించాయి.

త్రిపాదూర్ద్వా ఉదైత్పురుషః|

పాడో సైహ భావాత్పునః|

తతో విస్వజ్వ్యక్రమాత్|

సాశనానశనె అభి|

.

వివరణ:-శక్తి (జగన్మాత) నుంచి ఈ మూడు లోకాలను పాలించుటకు ముగ్గురు అధిపతులు సృష్టించబడ్డారు.వారు సృష్టి స్తితి లయ కారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.వీరు సృష్టి,స్తితి,లయ క్రియలు అదుపుచేస్తూ ఈ సమస్త విశ్వాన్ని వారి ఆధీనంలో ఉంచుకుని ఉండటం వలన,ఈ సమస్త విశ్వం వారి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటుంది.

.

తస్మాత్ విరాడ జాయత |

విరాజో ఆదిపురుషః|

సజాతో అత్యరిచ్యత|

పస్చ్చాద్భూమి మదోపురః|

.

వివరణ :-యోగ నిద్ర లో ఉన్న స్తితి క్రియాదిపతి అయిన విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మపు మద్యలో ఉన్న బ్రహ్మ మొదటగా యోగ నిద్ర నుంచి మేల్కున్నాడు(అది పురుషః).

బ్రహ్మ ద్వారా భూమి పుట్టుక,ప్రాణి పుట్టుక జరిగింది.మొదట సనక సనందాదులు,బ్రహ్మ మానస పుత్రులు,ప్రజాపతులు వీరి నుంచి దేవతలు ఉద్భవించారు.

.

యత్పురుషేన హవిషా |

దేవా యజ్నమతన్వత|

వసస్తో అస్యాసిదాజ్యం|

గ్రీష్మ ఇద్మ్స్సరద్దవిహ్|

.

బ్రహ్మ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడు.యజ్ఞం చెయ్యటానికి నిర్ణయించుకుని యజ్ఞం చేయటం ప్రారంభించాడు.ఆ యజ్ఞం నుంచి ముందుగా పంచ భూతాలు ఉద్భవించాయి.ఆకాశం(అంతరిక్షం),భూమి,నీరు,వాయువు మరియు అగ్ని.వీరిని ప్రదాన దేవతలుగా చేసి యజ్ఞాన్నిఅగ్నిమరియు మిగిలిన పంచభూతాల సహాయంతో ఉదృతం చేయసాగాడు.తద్వారా వాతావరణం,ఋతువులు మరియు కాలాలు ఏర్పడ్డాయి.

.

సప్తాస్యాసన్ పరిధయః|

త్రిస్సప్త సమిధః కృతాః |

దేవా యద్యజ్ఞం తన్వానాః |

అభధ్నన్ పురుషం పశుమ్ |

.

వివరణ:-యజ్ఞం చెయ్యటానికి సమిధలు,నెయ్యి కావాలి.కావున ఆ కాలంలో సమిధలుగా ఏడుగురు దేవతలు సమిధలు గాను,వసంతం నెయ్యి గాను మారి యజ్ఞ కార్యానికి తొడ్పడినారు.కావున యజ్ఞానికి తోడ్పడిన దేవతల పేరు మీదుగా ఈ ప్రక్రియను పిలవటం జరుగుతుంది.కావున వీరి నుంచి మూడు ఏదుల ఇరవై ఒక సూత్రాలు ఏర్పడినాయి.

ఇలా వీరి సహాయం తో యజ్ఞం చేస్తూ బ్రహ్మ కామదేనువు(గోమాత,ఆవు)ను సృష్టించాడు.

.

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్|

పురుషం జాత మగ్రతః |

తేన దేవా అయజన్త|

సాధ్యా ఋషయశ్చ యే ||

.

వివరణ:-ప్రాణి పుట్టుక లో భాగం గా యజ్ఞం నుంచి మొదట నీటిలో ద్రవ్య రూపం లోని శైవళం ఏర్పడింది.ఈ శైవళం జాతి క్రమంగా మొక్కల వరకు చెట్ల వరకు అభివృధి చెందింది.

తరువాత విజ్ఞులు,దేవతలు యజ్ఞాన్ని కొనసాగించారు.

.

తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః|

సంభ్రుతం పృషదాజ్యమ్ |

పశూగంస్తాగం శ్చక్రే వాయవ్యాన్|

ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ||

.

వివరణ:-ఈ యజ్ఞం నుంచియే బ్రహ్మ పక్షులను గాలిలో ఎగరటానికి,పశువులను అడవులలో పెరగటానికి సృష్టించాడు.

తస్మా ద్యజ్ఞాత్ సర్వహుతః|

ఋచః సామాని జజ్ఞిరే |

ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్|

యజు స్తస్మా దజాయత ||

.

ఆ యజ్ఞం నుంచియే మొదట వేదానికి పునాది పడింది.

తస్మా దశ్వా అజాయన్త|

యే కే చోభయా దతః |

గావో హ జజ్ఞిరే తస్మాత్|

తస్మా జ్జాతా అజావయః ||

.

వివరణ:-ఈ యజ్ఞం నుంచి ఒక దవడ లేక రెండు దవడలు దంతాలు గల నెమరువేసే జంతువులు.(గుర్రం,ఒంటె,గొర్రె,మేక మొ..) ఉద్భవించాయి.సమస్త ప్రాణి స్వరూపం,ప్రతి రేణువు,ప్రతి రసాయనం ఈ యజ్ఞం నుంచి శాకోపశాకలుగా పుట్టినవే.

ఈ విదంగా యజ్ఞం ద్వారా బ్రహ్మ ఈ భూప్రపంచాన్ని సృష్టించాడు

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!