అంతరాత్మ సణుగుడు!

_

అంతరాత్మ సణుగుడు!

(Vvs Sarma గారి పోస్ట్ .. మీకోసం వారికి కృతజ్ఞలతో .)

-

ఆ సాయంత్రం....

రాక్సీ లో నార్మా షేరర్,

బ్రాడ్వే లో కాంచనమాల!

ఎటకేగుటకో సమస్య తగిలిందొక

విద్యార్ధి కి!

ఆ సాయంత్రం.... 

ఉడిపీ శ్రీకృష్ణ విలాస్ లో

అటు చూస్తే బాదం హల్వా,

ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ!

ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి!!

ఆ సాయంత్రం....

ఇటు చూస్తే అప్పులవాళ్ళూ

అటు చూస్తే బిడ్డల ఆకలి!

ఉరిపోసుకు చనిపోవడమో,

సముద్రమున పడిపోవడమో..

సమస్య గా ఘనీభవించిదొక సంసారికి!!

........శ్రీ శ్రీ (మహాప్రస్థానం 1939)

శ్రీ శ్రీ సమస్యలన్నవి సమస్యలు (problems) కావు. ఏమి చేయాలి?

- సమస్య ; ఒక పరిష్కారం - సినిమాకు వెళ్ళాలి? 

పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి చదువుకోవచ్చు కదా -

అంతరాత్మ సణుగుడు - ఆ పరిష్కారాన్ని తిరస్కరించాలి -తాత్కాలిక నిర్ణయం .

ఏ సినిమాకు వెళ్ళాలి? - సమస్య - రెండు పరిష్కారాలు వచ్చాక వాటిలో ఏది (rational choice) హేతుబద్ధ నిర్ణయం అని తేల్చుకోవాలి...

-

ఇది nudging hard decisions or judgements,

Binary decision problems of poet Sree Sree (శ్రీ శ్రీ)

-

Nudge = a small push, probably with elbow (ఉచ్చారణ - నడ్జ్ కి నూడ్జ్ కి మధ్య హ్రస్వ శబ్దంగా) 

-

ఈ పదాన్ని తెలుగులో ఏమనాలి? ఆంగ్లంలో ఇది నామవాచకము, క్రియాపదము కూడా. నాకు తట్టిన

పదం - కుదుపు 

ఒక చిన్న కుదుపుతో నిర్ణయాన్ని ఇంకా బాగు చేయవచ్చు

Decision and Judgement

నిర్ణయం, నిశ్చయం, నిర్దేశం, తీర్పు, అభిప్రాయం, . 

మనస్తత్వ శాస్త్రం, అర్థ శాస్త్రం సరిహద్దు ప్రాంతంలో ఉండే విషయం మనోధర్మ ఆర్ధిక శాస్త్రం ( Behavioral ఎకనామిక్స్) . కఠిన నిర్ణయాలను మెత్తబరిచే వెసులుబాటు న్యాయ నిర్ణేతకు ఉండాలి. ఉదాహరణకు, దీపావళి ముందు వారం రోజలనుండి ఢిల్లీ దేశరాజధాని ప్రాంతంలోధ్వని, వాతావరణ కాలుష్యాల దృష్ట్యా టపాసులు అమ్మరాదు, అని న్యాయ మూర్తి తీర్పు ఇచ్చారనుకొండి . ఇది మెత్తని తీర్పే. పది రోజులముందు కొనుగోళ్ళకు అభ్యంతరం లేదు. ఉన్నవి కాల్చుకోడానికి అభ్యంతరం లేదు. నోయిడా (UP ) నుండి, గురుగ్రామ్ (హర్యానా) నుండి కొని తీసుకు రావడానికి కూడా అభ్యంతరం లేదు. ఇది పౌరుల ఆరోగ్య సమస్య, వ్యాపారుల ఆర్ధిక సమస్య ఇదొక ఆట. ఆటగాళ్లు మనుష్యులే. అధివక్తలు (న్యాయ వాదులు) కనులు గీటి సలహాలు ఈయవచ్చు.

ఇది nudging hard decisions or judgements,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!