సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (14)


-

సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (14)

క్షితౌషట్పఞ్చాశద్ద్విసమధిక పఞ్చాశదుదకే

హుతాశే ద్వాషష్టిశ్చశ్చతురధిక పఞ్చాశదనిలే,

దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే

మయూఖా స్తేషామప్యుపరితవ పాదామ్బుజ

యుగమ్ !!

.

ఓ దేవీ ! క్షితి యందు ఏభై ఆరు, ఉదకంలో 

ఏభై రెండు, అనిలునిలో అరవై రెండు, వాయువు

లో ఏభై నాలుగు, దివిలో డెబ్భైరెండు , మనస్సులో 

అరవైనాలుగు సంఖ్య గలవై నీ చరణ కిరణాలు

వెలుగొందుతున్నవి. ఆ ఆరింటికి పైన సహస్రదళ

కమల మధ్యంలో వర్తించే చంద్ర బింబాత్మకమై

బైందవ స్థానమనే పేరుగల అమృత జలధితో

నీ పాదపద్మ యుగళం ప్రకాశిస్తోంది.

-

క్షితి = భూమి

ఉదకం = నీరు

అనిలుడు= అగ్ని

వాయువు = గాలి

దివి = ఆకాశం

మనస్సు = మనసు

ఓం హిమాద్రిజా యైనమః

ఓం వేదాంతలక్షణాయైనమః

ఓం కర్మబ్రహ్మమయ్యైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!