-సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (15)

-సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (15)

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం

వరత్రా సత్రాణస్ఫటిక ఘుటికా పుస్తక కరామ్,

సకృన్నత్వా న త్వాకథమివ సతాం సన్నిదధతే

మధుక్షీర ద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః !!

-

.

జననీ ! శరశ్చంద్రిక మాదిరి శుద్ధ మైన దానవూ, 

శశియుత మైన జటాజూటమే కిరీటముగా గలదానవూ , 

వరాభయ ముద్రలు, అక్షమాలా

పుస్తకాల ను ధరించిన దానవూ ఐన నిన్ను ఒక్క

మారైనా నమస్కరించి న కవీశ్వరులకు పూదేనియతో

గోక్షీరంతో, ద్రాక్షా ఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని

వహించిన మధుర వాక్కులు ఎలా ప్రాపించకుండా

వుంటాయి ?

(అలాంటి వాక్కులు ప్రాపిస్తవనిభావం).

ఓం గంగాధర కుటుంబిన్యైనమః

ఓం మృడాన్యైనమః

ఓం మునిసంసేవ్యాయైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!