-సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) (శ్రీ లలితాంబికాయైనమః) శ్లోకము (16)

శుభం -సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

(శ్రీ లలితాంబికాయైనమః)

శ్లోకము (16)

కవీన్ద్రాణాం చేతఃకమలవన బాలాతప రుచిం

భజన్తే యేసన్తః కతిచి దరుణామేవ భవతీమ్ ,

విరిఞ్చి ప్రేయస్యాస్తరుణతర శృఙ్గార లహరీ

గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రఞ్జన మమీ !!

-

తల్లీ ! పద్మాలకు ఉదయ కాలపు లేత ఎండ

మాదిరి కవుల మనో పద్మాల కు వికాసాన్ని

కలిగించే అరుణ వైన నిన్ను ఏ సత్పురుషులు 

సేవిస్తారో వారు శారదా లబ్దమైన శృంగారరస

గంభీరాలైన సుభాషితాలచేత సభాసదులైన

సుజనులకు హృదయ రంజనం గావిస్తున్నారు.

-

ఓం మాలిన్యైనమః

ఓం మేనకాత్మజా యైనమః

ఓం కుమార్యైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!