శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (17)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (17)

సవిత్రీ భిర్వాచాం శశిమణిశిలాభఙ్గ రుచిభి

ర్వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చిన్తయతి యః

సకర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభి

ర్వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః !!

-

అమ్మా ! వాక్కులను సృజించేవారూ, చంద్ర కాంత

మణుల శకలాల మాదిరి తెల్లనయిన దేహ ముఖ

కాంతి గలవారు ఐన వశిన్యాది శక్తులచే సేవించ

బడుతున్న నిన్ను ఎవరు చక్కగా ధ్యానిస్తాడో అతడు

కాళిదాసు మొదలైన కవుల యొక్క కవిత్వ రచన

మాదిరి రుచిమంతాలై సరస్వతీ దేవియొక్క ముఖ

కమల పరిమళంబుల వెదజల్లే మృదువైన 

వాగ్గుంభనలతో సమర్థుడై కవితల్లజు డవుతున్నాడు.

-

ఓం కన్యకాయైనమః

ఓం దుర్గాయైనమః

ఓం కలిదోష విఘాతిన్యైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!