దీపశిఖా కాళిదాసీయం! .

 కాళిదాసీయం!




.

దీపశిఖా కాళిదాసీయం! 

 .

"సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ 

యం యం వ్యతీయాయ పతి౦వరా సా

నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే 

వివర్ణభావం స స భూమిపాలః!

.

!

ఈ శ్లోకం కాళిదాసు రచించిన 'రఘువంశ కావ్యము లోని 'ఇందుమతీ స్వయంవర' ఘట్టం లోనిది. ఇందుమతి అజ మహారాజును స్వయంవరంలో వరించుకొంటుంది. అజుడు రఘుమారాజు కొడుకు. ఇందుమతి విదర్భ రాజకుమారి. ఉత్తరోత్తరా ఈ దంపతులకు 

దశరథుడు జన్మిస్తాడు.

'సంచారిణీ దీపశిఖేన' అన్న ఈ ఉపమ రసజ్ఞులను ఎంత ముగ్ధులను చేసిందంటే,

యిప్పటికీ కాళిదాసు మహాకవిని దీపశిఖా కాళిదాసుగా ప్రస్తావిస్తుంటారు.

.

స్వయంవరం లో వరమాల చేతిలో తీసుకొని బారులు తీర్చి కూర్చున్న రాజకుమారులను దాటుకుంటూ వెళ్తున్న ఇందుమతి సంచారిణీ దీపశిఖ లాగా ఉన్నదట.

రాత్రిపూట చీకట్లో కర దీపంతో నగరంలోని రాజమార్గంలో 

ఒకడు నడుస్తూ వుంటే, వాడు దగ్గరకొచ్చినకొద్దీ ఒక్కో భవనం,

ఆ వెలుగులో మెరిసి పోతూ కనిపిస్తుంది.

వాడు దాటిపోగానే, ఆ భవనం చీకటిలో కలిసిపోతుంది.

దాని తర్వాత భవనం వెలుగులోనికి వస్తుంది.

.

దీపశిఖ లాంటి ఇందుమతి ఒక్కో రాజును సమీపించగానే

ఆమె ముఖ కాంతి వల్ల, ఆమె తమనే వరిస్తుందని ఆశవల్లా ఆయారాజుల వెలిగి పోతున్నాయి.వాళ్ళను వరించకుండా ముందుకు వెళ్లిపోతుంటే వాళ్ళ ముఖాలు కళతప్పి నల్లబడి పోతున్నాయి. ఆ వరుసలో తరువాతి రాజులముఖాలు వెలిగి పోతున్నాయి.

రఘువంశ కావ్యం లో కాళిదాసు దిలీప మహారాజు నుండీ అగ్నివర్ణుని వరకూ రాజ్యం చేసిన రఘువంశ రాజుల వృత్తాన్తము రచించాడు.సంస్కృతం నేర్చుకునే విద్యార్థులందరూ తప్పక చదవ వలిసినపంచ కావ్యాల్లో రఘువంశ కావ్యము ముఖ్యమైనది. మొదటిది...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!