విశ్వనాధ రామాయణ కల్పవృక్షం మహాలయం! -



-

విశ్వనాధ రామాయణ కల్పవృక్షం మహాలయం!
-
విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం మహాలయం. సమాంతరంగా వారు వెలువరించిన ఖండకావ్యాలు,
లఘు కావ్యాలు, నవలలు, నాటకాలు, గీతాలు,
ప్రసంగ వాక్యాలు కల్పవృక్షంతో పాటు పెరిగిన పొగడలు, పొన్నలు, పున్నాగలు. వి॥బాగానే రాస్తారు గానీ ఒక పట్టాన అర్థం కాదనేవారున్నారు.
‘పాషాణపాక ప్రభూ’ అని సంబోధించినవారున్నారు.
అయినా కల్పవృక్ష మహా నిర్మాణాన్ని ఆయన ఆపలేదు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సీతా స్వయంవరాన్ని సీస పద్యంలో వర్ణించి, తర్వాత తేటగీతిలో:
-
అతని దృష్టికి జానకి యాగలేదు
అతని కృష్టికి శివధనుస్సాగలేదు
సీత పూజడ వెన్నుగా శిరసు వంచె
చెరుకు గడవోలె నడిమికి విరిగె ధనువు.
-
సీతను చూపిన తీరు ఇది. కవి సమ్రాట్‌కి సందర్భ శుద్ధి ఉంది. ఒక్కొక్క సందర్భానికి తగినట్టు పూర్వకవిని ఆవాహన చేసుకుని ఆ మార్గంలో కథ నడిపించారు.
ఆదికవి నన్నయ్య నుంచి నాచన సోమన్నదాకా కల్పవృక్షంలో సాక్షాత్కరిస్తారు.
మీ కల్పవృక్షం చాలామందిని కదిలించింది.
దాని ప్రేరణలో విషవృక్షం కూడా మొలిచిందండీ అంటే
.
‘‘ఔనౌను, ఎవరి మార్గం వారిది. నేను వెర్రివాడిని. నాకు ఏడు జన్మలకు గాని ముక్తి లేదు. వారిది వైరిమార్గం. జయ విజయులు చూపిన దారి. మూడు జన్మలకే ముక్తి!’’ అనేవారు,
అలవాటుగా ఉండే థూ... థూల మధ్య.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!