విశ్వామిత్రుడు-విశ్వామిత్రుడు!

విశ్వామిత్రుడు--విశ్వామిత్రుడు!

.

విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది.

..

గాయత్రీ మంత్ర సృష్టి కర్త

శ్రీరామునకు గురువు.

హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.

త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, 

సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు

శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

.

కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూలపురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని ప్రతినామమే కౌశికుడు.

.

ఒక విశేషం...

విశ్వ + అమిత్రుడు = విశ్వామిత్రుడు అవుతుంది. ఇది సవర్ణదీర్ఘ సంధి. ఈ విధంగా తీసుకుంటే విశ్వానికి విశ్వామిత్రుడు శత్రువు అని అర్థం వస్తుంది. కాని, మహామహుల విషయంలో దుష్టమైన అర్థం తీసికోరాదు కనుక, విశ్వానికి మిత్రుడు అనే అర్థం లోనే విశ్వామిత్ర పదాన్ని తీసుకోవాలి.

ఇది నిజానికి విశ్వ + ఆమిత్ర = విశ్వామిత్ర అవుతుంది ఆమిత్రుడు అంటే సర్వదా, ఎల్లకాలము లందూ మిత్రుడు అని .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!