శివ శివ శివ అనరాదా-శివ నామము చేదా! (శ్రీ దేవులపల్లి .)

శివ శివ శివ అనరాదా-శివ నామము చేదా!

(శ్రీ దేవులపల్లి .)

-

శివ శివ శివ అనరాదా

శివ నామము చేదా

శివపాదము మీద - నీ

శిరసునుంచరాదా

భవసాగర మీద - దు

ర్భర వేదన ఏదా ॥

.

కరుణాళుడు కాదా ప్రభు

చరణ ధూళి పడరాదా

హరహరహర అంటే మన

కరువు తీరి పోదా ॥

.

కరి పురుగు పాము బోయ

మొరలిడగా వినలేదా

కైలాసం దిగి వచ్చి

కైవల్యం ఇడలేదా

మదనాంతకు మీద - నీ

మనసెప్పుడు పోదా

మమకారపు తేరా స్వామిని

మనసారా కననీదా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!