భగవంతుడు ఏమి కర్మ చేస్తాడు?

భగవంతుడు ఏమి కర్మ చేస్తాడు? 

ఆయన whole time duty ఏమిటి?

ఆయన పనిచేయకపోతే లోకాలు నాశనం కావడమేమిటి?

భక్తులకోరికలు తీర్చడమా ఆయన పని? ఆపదలలో కాపాడడమా?

ప్రకృతిలో జరిగే వైపరీత్యాలకు ఆయన కారకుడా? 

భక్తులు కానివారి విషయంలో ఆయన ఎలాఉంటాడు?

ధర్మ సంస్థాపనకు, సాధువుల రక్షణకూ దుష్ట శిక్షణకు, అవతారాలు ఎత్తడానికి ఆయన వెచ్చించే సమయం ఎంత? 

ఆయన కాలమానంలో అది క్షణం కూడా ఉండదే. సామాన్యులకు వచ్చే ప్రశ్నలే ఇవి. 

.

ఈ సందర్భంలో సద్గురు శివానందమూర్తిగారి ఒక వాక్యం మన ఆలోచనలకు ఒక మార్గం చూపిస్తుంది.

మహావిష్ణువు సృష్టి సంకల్పంతో బ్రహాండము,ప్రతి సర్గకు సృష్టికర్తయైన బ్రహ్మ

ఒకసారే సృజింపబడ్డారు. 

హిరణ్య గర్భుడు, విరాజ్ (విరాట్పురుషుడు) అనే పేర్లతో ఆయన పిలువబడుతాడు. పురుషునిగా,ప్రకృతిగావచ్చి విశ్వములో ప్రతీ అణువుయందు భగవంతుడు వ్యాప్తిచెంది యున్నాడు.

అందుచేత విశ్వములోని ప్రతికర్మమును చేయుచున్నది ఆ భగవంతుడే.

ఘోర, అఘోర రూపములు, జ్ఞాన అజ్ఞానములు ఆయన సృష్టించినవే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!