శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (38)

                                   శుభం -సౌందర్య లహరి!

 -

సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (38)

-

సమున్మీల త్సంవిత్కమల మకరందైక రసికమ్

భజే హంసద్వంద్వం కిమపి మహతాంమానసచరమ్!

యదాలాపా దష్టాదశ గుణిత విద్యా పరిణతిః

యదాదత్తే దోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ !!

-

భగవతి _ భగవానుల అసలైన తత్వాన్ని ఎరిగిన వారు సామాన్యులు కారు. వారు యోగిపుంగవులు,

పరమహంసలు, దీనిని సూచ్యంగా చెప్పే శ్లోకమిది.

మానస సరోవరాల్లో మాత్రమే విహరించేటటువంటివి

దివ్య హంసలు . వాటికి పాలను నీటిని వేరుచేసే

గుణం స్వభావ సిద్ధం .

జగన్మాతా పితరులనే అంబా శాంభవులను ఆరాధించే వారు ఇట్టి హంసలవలె గుణదోషాలుగ్రహించగల నేర్పు కలిగి ఉంటారు. వారికీ శివ_ శివాణీరూపాలకు అభేదం.

కనుక ఈ శ్లోకము లోని ' సాంకేతికం' గా చెప్పబడిన

అర్థాన్ని తీసుకుంటే... పరమహంసలైన యోగీశ్వరుల

మనస్సనే సరోవరాల్లో సంచరించే పర దేవీ దేవుల

సమ్మిళిత రూపం 'హంసమిధున' మనే 26వ తత్వాన్ని

అష్టాదశ విద్యా పూర్వకంగా భజించుట. పరిపూర్ణం

గా పరదేవతా తత్త్వం అర్థం చేసుకోవడానికి సామా

న్యులకు అసాధ్యం . అందుకు సహకరించేవి _ 18

విద్యలు. 

ఇవీ కొంతవరకూమాత్రమే దారి చూపగలవు

మిగిలింది సాధకుల స్వానుభవం మీద గ్రహించ

వలసినదే.

అష్టాదశ విద్యలంటే పద్దెనిమిది విద్యలని అర్థం అవి

1) శిక్ష . 2) కల్పం 3) వ్యాకరణం 4) నిరుక్తం

5) జ్యోతిషం 6) చందస్సు 7) ఋగ్వేదం

8) యజుర్వేదం 9) సామవేదం 10)అధర్వణవేదం

11) మీమాంస 12) న్యాయ శాస్త్రం 13)ధర్మ శాస్త్రం 

14)పురాణం 15) ఆయుర్వేదం 16) ధనుర్వేదం

17) గాంధర్వ వేదం 18) అర్థ శాస్త్రం .

-

ఓం రాగస్వరూపపాశాఢ్యాయైనమః

ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయైనమః

ఓం మనోరూపేక్షుకోదండాయైనమః

-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!