శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (40)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (40)

-

తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్పురణయా

స్పురన్నానా రత్నాభరణ పరిణద్ధేంద్ర ధనుషమ్ !

తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్

నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనమ్ !!

-

అమ్మా ! నీ మణిపూరక చక్రమే, ముఖ్య మైన

గృహంగా _ ఆచక్రానికి అలముకొన్న అంధకారంలో, 

దానికి శత్రువైన వెలుగు (ప్రకాశమే) మెరుపురూపంలో 

ఉన్నట్టి , రత్న నిర్మిత నగ వలె భాసించే ఇంద్రధనుస్సు

కలిగినట్టి , శ్యామవర్ణం కలిగినట్టి మేఘంలా ఉన్నాడు 

శివుడు ఇక్కడ _ ఈ శివుడు సంవర్తాగ్ని రూపుడు

ఇట్టి సూర్యుని తీక్షణ కిరణాల వల్ల అల్లాడుతున్న

ముల్లోకాలను తన వర్ష ధారలతో తడుపుతున్నదీ_

ఇటువంటిదని నిర్వచించడానికి శక్యం కానిదీ అయిన

మేఘునికి నా ప్రణామాలు.

మేఘరూపుడై న సదా

శివారాధన సదా నా నిత్యకృత్యమగుగాక !

=

ఓం కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయైనమః

ఓం అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయైనమః

ఓం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయైనమః

-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!