ప్రాణశక్తి -దశేంద్రియాలు !

ప్రాణశక్తి -దశేంద్రియాలు !

-

మనం ఈ దృశ్యప్రపంచాన్ని చూడటమే కాక, ఇందులో ప్రవర్తిస్తూ ఉంటాం. కాళ్ళతో నడవటం, చేతులతో పనులు చేయటం, నోటితో మాట్లాడటం, ఇవన్నీ బాహ్యప్రపంచంలో మనం చేసే పనులు. మనసుతో ఆలోచించటం, బుద్ధితో విమర్శించటం ఇవి అంతఃప్రపంచంలో చేసే పనులు. 

ఈ పనులన్నీ మనం ఇష్టపూర్వకంగా చేస్తుంటాం. 

కొన్ని పనులు మన ఇష్టం లేకుండానే జరుగుతుంటాయి. ఊపిరి పీల్చటం, గుండె కొట్టుకోవటం, రక్తప్రసారం, అన్నం జీర్ణమవ్వటం మొదలైనవి.

మనం ఇష్టపూర్వకంగా చేయగలిగే పనులకు ఉపయోగపడే అవయవాలనే కర్మేంద్రియాలు అంటారు.

అవి కాలు, చేయి, నోరు మొదలైనవి. 

అదే విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు – కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మనకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలుగ చేసేవి ఈ పది ఇంద్రియాలు మాత్రమే. 

ఈ దశేంద్రియాల వెనుక (శరీర, మనోబుద్ధుల వెనుక కూడా) ఒక ప్రాణశక్తి ఉంది.

ఆ ప్రాణశక్తి వల్లనే ఈ ఇంద్రియాలన్నీ పని చేస్తుంటాయి. మన శరీరంలో జరిగే మిగిలిన అయిష్ట పూర్వకమైన పనులు కూడా ప్రాణశక్తి వల్లనే జరుగుతాయి. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తులో సృష్టి జరుగుతున్నది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!