"ఫిర్ 'తుర్ "-చిలకమర్తి వారి "వినోదములు"కధ !


-

"ఫిర్ 'తుర్ "-చిలకమర్తి వారి "వినోదములు"కధ !

-

ఒక పాదుషా గారు జమాబందీ పేరుపెట్టి 

తన దేెశమందున్న కరణములనందరను

పిలిపించి

"తనకు కథలు చెప్పమని అడగడం,

ఎందరు ఎన్ని కథలు చెప్పినను తృప్తి

పొందక " ఫిర్ " అని ఇంకా ఇంకా చెప్ప

మని అనడం జరుగుతున్నది. 

"మాకికరావు " అని ఎవరైనా కరణము

చెప్పినచో వానిని చెరసాలలో బంధించె

డు వాడు. 

ఈ పాదుషాకు లెక్కకు మిక్కిలి కథలు చెప్పలేక కరణము

లందరు జైలు పాలగుచుండిరి.

ఈ విధముగా శిక్షింపబడుచున్న కరణములలో 

ఒకని కుమారుడు మిక్కిలిగడుసరి ఉండెను.

.

తండ్రికి వచ్చిన ఆపదగమనించిన అతడు పాదుషా 

కడకుపోయి తనివి తీరునట్లు కథలు చెప్ప

గలనని మొరపెట్టుకొనగా ఆ పాదుషా

పరమానందభరితుడై వానిని లోపలికి రప్పించి కథ ప్రారంభించుమనెను.

ఆనియోగి బాలకుడు కథ చెప్పుట ప్రారంభించెను.

-

"అనగననగా ఒక మర్రిచెట్టు కలదు. ఆచెట్టునకు వేయి కొమ్మలు ఉన్నవి. కొమ్మకు వేయి వలువలు, వలువకు వేయి ఆకులు , 

ఒక్కొక్క ఆకుపై ఒక పక్షిచొప్పున ఆ చెట్టుపై గలవు. 

ఒక వేటగాడు ఆ చెట్టు వద్దకు వచ్చి ఒక పక్షిని గురిచూసి బాణము వదిలెను.వెంటనే ఒక పక్షి చచ్చి క్రిందపడెను. 

ఇదిచూసి భయపడి తక్కిన పక్షులలో 

ఒకపక్షి 'తుర్ ' అని పారిపోయెను. 

"అనిచెప్పి కథ ముగించెను. 

తోడనే పాదుషా"ఫిర్ " అని పలికెను. 

ఆ నియోగి బాలుడు మరల 'తుర్' అని జవాబు చెప్పెను.

అప్పుడు నవాబు కోపించి --

"ఏమిటి? నీ తుర్ ఎంతవరకు ఉండునని

ప్రశ్నించెను. వెంటనే ఆ బాలుడు 

"మీ ఫిర్ఎంతవరకు ఉండునో నా' తుర్ ' 

అంతవరకు ఉండును. 

ఆ చెట్టుమీదలక్షలకొలది పక్షులు ఉన్నవి.

అవి ఒకేమారు ఎగిరిపోక ఒకదాని వెనుక 

ఒకటిగ పరుగెత్తెను. ఆ పక్షులు పూర్తిగా

ఎగిరిపోయిన గాని కథ ముగిసిపోదు.

అది ముగిసిన గాని క్రొత్తది చెప్పను. " అని 

ఆ బాలుడు చెప్పగా నవాబువిస్మితుడై --"నాకిక 

కథలక్కరలేదు,నీవుపొమ్మని" పలికెను. 

అతడు తాను పోవుటయే గాక , చెరలోనున్న మిగిలిన

వారినందరిని విడిపించి తన ఊరికి పోయెను.

-

(చిలకమర్తి వారి "వినోదములు" నుండి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!