గాయం – వేలసందర్భాలు!


గాయం – వేలసందర్భాలు!

-

నిలువెత్తు గాయం నడుస్తూనే ఉంది

నిత్య గాయాల జ్ఞాపకాలపై

రుధిరాశ్రువులు రాలుస్తూనే ఉంది

నిత్య నిశీధిని చెరుగుతూనే ఉంది

గాయానికి తెలుసు తను నడుస్తూన్నదిunnamed భావ సమూహలతోనూ, వాదాల పడవల పైననూ

పరిణామాల సిద్ధాంతాలతోనూ కాదని.

ఈ గాయం చాలా పురాతనమైనది

గాయానికి తెలుసు తనని అద్దంగా నిలబెట్టి

తన ఆత్మ విశ్వాసాన్ని చూసుకున్న కత్తి మొన గురించి

తనపై పరావర్తనం చెందిన కాంతితో

ప్రకాశించే కఠిన శిల నైజం గురించి

ఇప్పుడు గాయం ప్రక్కన నడిచే వారు

పైపైన మందు పూట పూసే వారు ఎవరూ లేరిక్కడ

ఎవరి తప్పులకీ, పాపాలకీ వారే శిక్ష ననుభవిస్తారే తప్ప

ఎవరి తప్పులని కాచి పాపాలని మోసే

అభినవ క్రైస్ట్ లు ఎవరూ లేరిక్కడ

గాయానికి తెలుసు మాను ఎండినా తీగకి ఆధారమైనట్లు

తనని తానూ నిలబెట్టుకోవాల్సిందే ఆత్మని ఆశ్రయించాల్సిందే …

అందుకే గాయం నడుస్తూనే ఉంది…

వేల సందర్భాల్ని తనలో దాచేసుకుని.

- వనజ తాతినేని


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!