రామచిలుక* జోక్!

రామచిలుక* జోక్!

=

ఓ వ్యక్తి పక్షులను అమ్మేషాపు కెళ్ళి రామచిలుకను చూపించమన్నాడు. షాపు యజమాని ఒక చిలుకను తీసి "ఇది చూడండి. ఈ రామచిలుక చూడ్డానికి ఎంత బాగుందో అంత బాగా మాట్లాడుతుంది.

దీని కుడికాలు పైకి ఎత్తితే 'నమస్కారమండీ' అంటుంది. ఎడమకాలు పైకి ఎత్తితే 'రండి. స్వాగతం' అంటుంది..." అంటూ వివరించాడు. "మరి రెండు కాళ్ళూ ఒకేసారి ఎత్తితే...?" సందేహంగా అడిగాడా వ్యక్తి.

"నోర్ముయ్యరా...! బుద్ధిలేని వెధవా...!! రెండు కాళ్ళూ పైకి ఎత్తితే కింద పడతాను..." ఠక్కున చెప్పింది రామచిలుక.

=

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!