.పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹
పద్మశ్రీ ప్రకాశరావు గారు .🌹 🌺🌺🌺🌺🌺 లవ్ యూ బాబాయ్..మీలాంటిల వాళ్ళుండబట్టే యగాంతాలు ఆగిపోతున్నాయ్..లేకపోతే ఈ పాడులోకం పాడు జనాల చేసే కుల,వర్ణ,మత,డ బ్బు రాజకీయాలకు భూమి ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయేది టీ ఆమ్మే తెలుగు వాడికి పద్మశ్రీ గౌరవం… ఎవరాయన, ఏమాకథ తెలుగు పత్రికల్లో ఒక వార్త ఈ రోజు కనిపించలేదు. తెలుగువాళ్లకు పద్మశ్రీ వచ్చినట్లు పత్రికల్లోవచ్చిన పేర్లలో ఒక పేరు మిస్ అయింది. ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తళుకులు బెళుకులు లేని వాడు. ఎపుడూ సంపాదన మీద దృష్టిపెట్టని వాడు. ఉన్నదాంట్లో సగం, అది ఇల్లూ కావచ్చు, సంపాదన కావచ్చు, ఎపుడూ పేద పిల్లలతో పంచుకునేవాడు. ఆయనే దేవరపల్లి ప్రకాశ్ రావు. ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. తన టీ స్టాల్ తో ఆయన విప్లవం తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకాశరావు చాలా కిందట ఒరిస్సా వెళ్లి, అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి చవరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు. అయితే, తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన చిన్న ఇంట్లో నే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగంతో పిల్లల మీద ఖర్చ పెట్టి చాలా పెద్ద వాడయ్యాడు. ఆంధ్ర ప...