Posts

Showing posts from July, 2015

భర్తృహరి సుభాషితం ! .ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు

Image
భర్తృహరి సుభాషితం ! . "ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్" భావం: ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

మధుర భావనలు .!

Image
మధుర భావనలు .! . నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి

కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

Image
కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము. రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు .ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది .శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు .కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి . త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్ శిష్యుడు. ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా . .సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ , విద్యారన్యులకు హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు .ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు ముఖ్య శిష్యుడు .రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు. గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యుడు .రఘు పతి వెంకట రత్నం గారికి

గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే ఈ ఆడవాళ్ళు ఇంతే...బాపు బొమ్మలు !

Image
అమయాకంగా తెల్ల పోతారు. , గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే  ఈ  ఆడవాళ్ళు ఇంతే. .. గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు. .. బాపు గారి లైలా! .. బాపుగారి అడవి సుందరి ! ... ..... ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి. .... అమయాకంగా తెల్ల పోతారు. ... .... గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు. ,,,,, బాపు గారి లైలా! ,,,,,,, బాపుగారి అడవి సుందరి ! ,,,,, ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి. ,,,,, ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ

అర్ధాంగి!

Image
అర్ధాంగి! పట్టు పితంబరం మట్టి పడి మాసేను... పాలు కారే మోము గాలికే వాడెను.... గొల్ల పిల్లలు చాల అల్లరి వరురా... గోల చేసి నీ పెయన కోదేములు చెప్పేరు... ఆడు కోవలనని పాడు కోవేలననిన అన్నింట నేను ఉన్నా.. ఒక అద్బుతమయినపాట.... జిక్కి గొంతు...మహానటి సావిత్రి నటన. (సావిత్రి చిత్రం ..పొన్నడ మూర్తి గారు.) https://www.youtube.com/watch?v=mP4y9ZQbToU

మన ఆటలు... పులి-మేక లేక .... పులిజూదం

Image
మన ఆటలు... పులి-మేక లేక .... పులిజూదం ఆడే పద్దతిః ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది!

Image
అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది! . అసలు అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది. దాని కల్పన, నిర్మాణం, ప్రదర్శన, అంతా కూడా ఒక కళ. ప్రకృతిలో ఎక్కడా కనుపించని సౌందర్యాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ కల్పనలో ఆ కూర్పులో అందం ఉంది. అసత్యానికి కూడా, కల్పనా, కూర్పూ కావాలె. దాని నిర్మాణంలో పనితనానికి ఎంతైనా అవసరం ఉంది. అందుకనే సత్యానికంటే అసత్యము ఎక్కువ సుందరమైనది. నేను ప్రభుత్వోద్యోగిని. నాకు సెలవు కావాలె. ఎందుకూ? జ్వరం వచ్చిందా? లేదు. కాని ఏదో బధ్ధకంగా ఉంది. ఇంట్లో పడుకోవాలె అనిపించింది. లేకపోతే భార ్యతో కబుర్లు చెప్పుకొంటూ కూర్చోవాలెనని బుధ్ధి పుట్టింది. సెలవకు వ్రాయాలె. సత్యాన్ని ఆశ్రయిస్తే ఉద్యోగాన్ని ఊడకొడుతుంది. సాయింత్రం మా ఆవిడ, నేను ఎంతో కష్టపడి మిగిల్చిన డబ్బుతో కొన్న పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెడుతుంది. ఆవిడ చీరకట్టుకొన్న సౌందర్యాన్ని నేను ముందుగా చూడాలని ఉంది. మధ్యాహ్నం సెలవు కావాలె. నిజం చెపితే సెలవు దొరుకుతుందా? అసత్యాన్ని ఆశ్రయించాలె. ఆవిడ ఓ చక్కని ఉపాయం చెబుతుంది. జబ్బు, తలనొప్పి, కడుపులో పోట్లు అని వ్రాయమని చెప్పటమే కాకుండా ముఖం ఇల్లాగ పెట్టు, నడుం ఇల్లాగ వంచు

నేను. (కవిత... శ్రీమతి శైలజ మిత్రా .)

Image
నేను. (కవిత... శ్రీమతి శైలజ మిత్రా .) . దారి తప్పిన ప్రార్థనకు పూజారిని కాలేను కష్టపడే పూజకు భక్తుడిని కాలేను ఇష్టపడే భక్తుడికి దైవాన్ని కాలేను కరుణించలేని దైవానికి మనిషిగా కనబడలేను మనసులేని మనిషికి జీవితాన్ని అందివ్వలేను

ఓ కూనలమ్మ.!

Image
ఓ కూనలమ్మ.! . అంత్యప్రాసల జల్లు భాషలో పరవళ్ళు “ఆరుద్ర” కే చెల్లు ఓ కూనలమ్మ “బాపు” బొమ్మల ఒంపు బుడుగు మాటల ఇంపు తెలుగు బాసకే సొంపు ఓ కూనలమ్మ

కృతజ్ఞతాగేయం - రచన: బాలాంత్రపు రజనీకాంతరావు

Image
కృతజ్ఞతాగేయం - రచన: బాలాంత్రపు రజనీకాంతరావు అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970) నే చేయునదీ నే చేయనిదీ సాధించినదీ ఫలియించనిదీ నీ యిచ్ఛలేక జరుగదట నా స్వేచ్ఛ మొదలు తుది యెచట!    ॥చేయునదీ॥ నిను చూచుటకే రప్పించితివీ నీ దరిసెనమే యిప్పించితివీ యీనోట పాట పాడించితివీ యిది ఎవరి రచనయని యడిగితివీ    ॥చేయునదీ॥ నా భావనమే నా జీవనమై నీ ప్రణయమ్మే నా కవనమ్మై నా అహపుటంచు చెరిపించెదవో నా ఇహము పరము గావించెదవో    ॥చేయునదీ॥ నాదామృతమే పరసాధనగా నీ దివ్య వాక్కే ఉద్బోధనగా ఈ రజని కాంతు లొలయించెదవో విశ్వ జనహితము వెలయించెదవో    ॥చేయునదీ॥

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథలు ]

Image
యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథలు  ] . పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. “ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు. ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి. ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస

శ్రీ కృష్ణ నిర్యాణం!

Image
శ్రీ కృష్ణ నిర్యాణం! . శ్రీకృష్ణుడు ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని పూశాడు కాని, అరికాలిలో మాత్రం పూయటం మరచిపోయాడు. ఫలితంగా ఆ ఋషి ఆ అరికాలిలోనే నీకు ప్రాణాపాయం జరుగుతుందని చెప్పిన విషయం గుర్తుకు రాగా, శరీరత్యాగం కోసం మనసును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణచిపెట్టి సమాధిని పొందాడు. ఆ సమయంలో 'జర' నేలను కాలితో రాస్తూ అడవిలో ప్రవేశించింది. 'జర' ముసలితనానికి అధిషా్ఠనదేవత. కాలం (మరణం) ఆసన్నమైనదని సూచించేది జర. ఆమెను కాలకన్య అని అంటారు. ఆమె వేటగాడిని భ్రాంతి ఆవహించేటట్లు చేసింది. ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి దృఢమైన రీతిలో నారిని సంధించి జింక అని భ్రమించి బాణం వదిలాడు. బాణం పాదంలో దూరి బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు మానవీయమైన దేహాన్ని విడిచి, పెంపొందిన తేజస్సు గలవాడై స్వర్గలోకానికి వెళ్లాడు.

ఈ దేశం నాకేమిచ్చింది?

Image
ఈ దేశం నాకేమిచ్చింది? . అటు కాశ్మీరు నుంచి ఇటు కన్యాకుమారి వరకు, ఆ మూల ధాతు అడవుల నుంచి ఈ మూల సముద్ర తీరం వరకు, మదమెక్కిన కులాల పిచ్చినుంచి పట్టు తప్పిపోయిన ఐకమత్యం వరకు, కొంతమందికి ఒకటే ఆవేదన ఆకలికోసం ఆక్రందనలోపడి స్వార్ధం తెచ్చిన ఆవేశంతో ఈ దేశం నాకేమిచ్చింది నేనెందుకు దేశానికి ఇవ్వాలనే వ్యర్ధమైన మాటలంటూ ధరణి తల్లి ఎదను గుచ్చుతున్నారు. తన కన్నీటిలో తడుస్తూ తృప్తిపడుతున్నారు. రోజులెందుకలా అయ్యాయని గళమెత్తాలా రోజులలా మారాయని సర్దుకొవాలా అందుకే నేనో సవాలు విసురుతున్నా – భార్య నిందించిందని బాధపెట్టే నీవు హాంగ్ కాంగ్ లో కాపురం పెట్టి చూపించాలా ! అత్యాచారం చేసి తప్పించుకు తిరిగే నీవు దుబాయ్ వెళ్లి వేధింపులకు గురిచేసి తప్పించుకో చూద్దాం ! ఎవ్వరికీ తెలీకుండా దొంగపెళ్ళి చేసుకునే నీవు గ్రీస్ లో ఉంటూ నీ బుద్ధి చూపించు చూద్దాం ! అర్ధరాత్రైనా నిరభ్యంతరంగా తిరిగే నీవు చెస్టర్ దేశం వెళ్లి అక్కడలా తిరిగి చూపించు చూద్దాం ! తోటివాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ అవహేళన చేసే నీవు అమెరికాలోని ఒక్లాహమాలోని జంతువులను అలా చెయ్ చూద్దాం ! మైకుపెట్టి గోల సృష్టించే నీవు సింగపూర్

ఐకమత్యం.

Image
ఐకమత్యం..........(పైడిమర్రి రామకృష్ణ.) అనగనగా ఒక అడవిలో కోతుల గుట్ట ఉండేది. అక్కడ చాలా కోతులు, కొండముచ్చులు నివసించేవి. ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్దపెద్ద ఊడలతో అందంగా ఉండేది. ఆ మర్రిచెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకొంటూ ఉండేవారు. కోతులు, కొండముచ్చులు ఎప్పుడు పోట్లాడుకునేవి. చెట్లకు కాసిన పళ్లు, కాయలు కోసుకుని తిని, చెరువులో నీటిని తాగి మర్రిచెట్టు మీద ఎగిరేవి. కొండముచ్చులు రాగానే కోతులు మర్రిచెట్టును వదిలి గుట్టల్లోకి పారిపోయేవి. ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు. అవి అప్పుడప్పుడు ముని తపస్సును భంగపరిచేవి. ముని పట్టించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు. ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి. దాంతో చెరువు ఎండిపోయింది. చెరువుని చూసి కోతులు, కొండముచ్చులు బాధపడ్డాయి. దాహం తీర్చుకోటానికి ఏం చేయాలో వాటకి తోచలేదు. అప్పుడే బుజ్జి కోతులు నీటి కోసం 'కిచకిచ'మని అరిచేవి. ముసలి కోతులకు కూడా కష్టమైంది. అవి నీటికోసం చాలా దూరం ప్ర

మహా ప్రస్థానం.

Image
మహా ప్రస్థానం.....పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా, వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది.....చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....మహాభారతం...మహా ప్రస్థాన పర్వము . (మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది. కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!)

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--

Image
ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:-- భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట నుండునో విజయ మచటనుండునని పలుకుట అక్షరసత్యం! "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే! సకల సంస్కృత వాంగ్మయమునకును తలమానికమై విరాజిల్లెడు ఈ మహాభారతము ఇంతయై, అంతయై పెరిగి పెరిగి లక్షశ్లోకాత్మకమైన ఒక మహాగ్రంథముగా ప్రపంచ విఖ్యాతి వడసినది. నిఖిల భారతీయ జ్ఞాన విజ్ఞాన సర్వస్వమైనది. "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్" భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు. భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట

కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు.

Image
కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు. తరాలు మారాయి.. ఇల్లు చేతులు మారింది.. అమ్మ గారు కృష్ణమ్మా గారు జనించిన పుణ్య స్థలం. గోపాల స్వామీ గుడి పక్కన..నాకు పుణ్య స్థలమే.. పుష్కర స్నానం కంటే నాకు పవిత్రం. ఏ త్తు అరుగులు..చిన్న ధాన్యం కొట్టు..వెనక పెద్ద పెరడు ఉండేవి.. రోడ్లు పెరిగి అరుగులు పోయాయి.. పక్క నున్న జాజలు వారు..నేతి వారు.. బొడ్డు వారు.. వేల్లలవారు.. అంతా ఎక్కడ ఉన్నారో కదా వాళ్ళు ఇల్లు ఉన్నాయి.. .గుడి రాముడుకి అన్ని తెలుసు ఆ వేణు గోపాల స్వామి సాక్షి..

బామ్మా గారి పుష్కర యాత్ర ..

Image
బామ్మా గారి పుష్కర యాత్ర ..

చూసుకున్నవాడు ముందు చేసుకున్నవాడు లొకువ.

Image
చూసుకున్నవాడు ముందు చేసుకున్నవాడు లొకువ.
Image
మన పుష్కర పురుషులు. గౌతమీ మహా ఋషి,రాజ రాజ నరేంద్రుడు, గోదావరి తల్లి, మన కాటను దొర.

గోదావరి ..శ్రీ నాధుడు !

Image
గోదావరి ..శ్రీ నాధుడు ! . రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. “త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి” సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ “గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే“ అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు. “కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్“ అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు. “గోదావరి గోదావరి గోదావరియంచు పల్కు గుణవంతులమేన్ గోదావరి తల్లి న పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్“ అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ గోదావరి నామోచ్చారణతో పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో “సప్తగోదావరీ జలముతేనె” అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత” అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి “నేట

Bombay..1950.

Image
Bombay..1950. ai dil hai mushakil jeena yahaan zara hat ke, zara bach ke ye hai bambai meri jaan . kahin "building", kahin traame, kahin "motor", kahin "mill" milata hai yahaan sab kuchh, ik milata nahin dil insaaf ka nahin, kahin naam-o-nishaan . kahin satta, kahin patta, kahin chori, kahin res, kahin daaka, kahin phaanka, kahin thokar, kahin thes bekaaro ke hain, kai kaam yahaan . beghar ko aavaara yahaan kehate hans hans khud kaate gale sab ke, kahe is ko "business" ik cheez ke hain kai naam yahaan

సినీమా(ట)ల తూటాలు !

Image
సినీమా(ట)ల తూటాలు !   ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.  ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్.  “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్.  వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్. “ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా”?, (ఫైవ్ అంటే ఇక్కడ అయిదు వందలు, అయిదు రూపాయలు కాదు), అడిగాడు అప్పారావు ఈ లోపల (అతని అసలు పేరు ఏదైనా, అందరూ అలాగే పిలుస్తారు).   అతని బారి నుంచి తప్పించుకోడానికి టాపిక్ మారుస్తూ, అవునూ “తీ తా” (తీసేసిన తాసిల్దారు) సంగతి ఎంతవరకు వచ్చింది? అని ఆ మధ్య సస్పెండ్ అయిన కొలీగ్ గురించి అడిగాడు రమేష్.  “అమ్యామ్యా” కేసులు అంత తొందరగా తేలుతాయా?  గడ్డి తినే ముందే బుద్ధి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని జవాబు. “హింస రాజు” (బాస్) అర్జెంటు గా నిన్ను టూర్ వెళ్ళమన్నాడుట?, నువ్వు నీ గోవా ట్రిప్ మానుకుని వెళుతున్న్నావుట?, నిజమేనా?  ఇంకో కొలీగ్ ప్రశ్న.  “అతిగా హింసించే బాస్, ఇతరుల విషయాలలో అతిగ

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? (బేతాళ కధ.)

Image
పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? (బేతాళ కధ.) . కొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి. ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు కార్తికేయుణ్ణి భగవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. పైకి అది అర్ధింపులా కనబడినా, అందులో ఉన్నది ఆజ్ఞే! అయితే ఇతడు కౄరుడు. అందుచేత కార్తికేయుడికి, తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అది పైకి చెబితే..... ఇతడు వియ్యం వదిలి కయ్యానికి కాలు దువ్వగలడు. ఎలా ఈ విపత్తు దాటటం? రాజుకేమీ పాలుపోలేదు. దిగులుగా కార్తికేయుడు, భగవతి మందిరానికి వచ్చాడు. అతడికి కుమార్తె ప్రక్కనే సుకేశిని (మారు వేషంలో ఉన్న ధనస్వామి) కనబడింది. ఒక్కసారిగా రాజు బుర్రలో ఉపాయం మెరిసింది. తన కూతురికి బదులుగా, సుకేశిని నిచ్చి, పొరుగు దేశపు యువరాజుకిచ్చి వివాహం జరిపించాడు. తన కూతురు అందమైనదని తెలుసు గానీ ఎలా ఉంటుందో తెలియదు గనుక అందులో ఏ ప్రమా

ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే..

Image
ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే.. . ఆంధ్రజ్యోతి....(29-Jun-2015) తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి.. అందరికీ తెలిసిన నానుడి.. ఈ రెండింటికి లింకేమిటో తెలియదుగానీ, గోదావరికి, భారతానికి కచ్చితమైన బంధం ఉంది. ఆదికవి నన్నయ్య మహా భారతాన్ని తెనుగీకరించింది ఇక్కడే. అంతే కాదు, భారతానికి సృష్టికర్తలైన పాండవులు నడయాడిన జాడలూ ఇక్కడున్నాయి. అటు రామాయణం ఇటు భారతం. గోదావరి స్మృతి పథాలు! వేంగీ రాజ్యాన్ని పెదవేగి కేంద్రంగా విమలాదిత్యుడు పాలన సాగించేవాడు. 1019లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు 1021లో పట్టాభిషక్తుడయ్యాడు. తమ కులదైవం ఆది వరాహస్వామి ఆశీస్సులతో, ప్రధానమంత్రి వజ్జియ సోమయాజి దీక్షాదక్షతలతో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నదీవాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సుసంపన్నం చేశాడు. చంద్రాదిత్య దండనాథుడి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పరిరక్షించాడు. ఆంధ్ర మహాభారతం. ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది పవిత్ర గోదావరి తీరం.. రాజమహేంద్రవరం.. దాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు..అతడి ఆస్థానకవి నన్నయ భట్టారకుడు. ఆదికవి నన్నయ్య అవతరించిన చోటే ఆంధ్ర మహాభారత రచనకు బీ

.......చిరునవ్వుల చిన్నారులు.........

Image
.......చిరునవ్వుల చిన్నారులు.........

చందమామ కధ.!

Image
చందమామ కధ.! ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి. ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలుగాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి. ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు. చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చుకుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి. అ