- వైకుంఠపాళి -



 
 
,
- వైకుంఠపాళి -
వైకుంఠపాళి లేదా దశపద ప్రాచీన భారతీయ ఆట. క్రీ.పూ 2వ శతాబ్దములో నుండి ఈ ఆట భారతదేశములో ఉన్నదని చారిత్రీకులు భావిస్తున్నారు. సాధారణంగా ఇద్దరు మనుషులు ఆడే ఈ ఆట ఒక నలు చదరము పై ఆడతారు. ఈ చదరములో సాధారణంగా 10 అడ్డవరుసలు, 10 నిలువువరుసలతో మొత్తం 100 గడులుంటాయి. అయితే కొన్ని రూపాంతరాలలో 8 అడ్డ నిలువు వరసలు, 12 అడ్డ నిలువు వరుసల చదరాలు కూడా ఉంటాయి. చదరంపై చిత్రించబడి ఉన్న పాములు మరియు నిచ్చెనల(సోపానాలు) అమరిక చదరాన్నిచదరాన్ని బట్టి మారుతుంటుంది. పాములు, సోపానాలు నిర్ధిష్టమైన గడులలో ఉండనవసరం లేదు. చదరంలో యొక్క పరిమాణము, చదరంలో పాములు మరియు సోపానాల అమరికపై ఆట యొక్క నిడివి ఆధారపడిఉంటుంది.

వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపదసోపానమటమని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ)ని ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!