Posts

Showing posts from 2019

గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:-

Image
గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:- (Anappindi Suryalakshmi Kameswara Rao) ఆంధ్రప్రదేశ్‌ ఒంగోలులో 1926లో జన్మించిన వరలక్ష్మి తన పదకొండవ ఏటనే నాటకల్లో నటించాలన్న ఉత్సాహంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయారు. ఆ రోజుల్లో తుంగల చలపతి, దాసరి కోటిరత్నం ఇద్దరూ ప్రసిద్ధ రంగస్థల నటులు. ''రంగూన్‌ రౌడీ, సక్కుబాయి'' చిత్రాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న సందర్భం అది. వారి ప్రభావం జి. వరలక్ష్మి మీద పడింది. తన పన్నెండవ ఏటనే బారిస్టరు పార్వతీశం, బొండాం పెళ్లి చిత్రాల్లో నటించారు. హెచ్‌.ఎమ్‌.రెడ్డి, రఘుపతి ప్రకాశ్‌ ఈమెను ప్రోత్సహించారు. అప్పట్లో నౌషద్‌ గారి పాటలంటే పడిచచ్చేవాళ్ళు. జి. వరలక్ష్మి 'నౌషద్‌' ట్రూపులో చేరి పాటలు పాడేసి గొప్ప గాయనీమణి అయిపోవాలన్న కలలు కనేది. అనుకున్నదే తడవుగా బొంబాయి వెళ్ళిపోయింది. అతి చిన్న వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశం... పైగా తప్పొప్పులు చేప్పేవాళ్ళు ఎవరూ లేరు. తన మనసులో మెదిలే ఏ పనైనా దూకుడుగా చేసెయ్యడం... ఎదురు దెబ్బ తగిలితే రాటుదేలడం... ఇదే నేర్చుకుంది. అయితే దేవుడిచ్చిన గొప్పవరం తె

మను చరిత్ర - ఒక ఆలోచన!

Image
మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy) శ్రీ సరస్వత్యై నమః ఆరజ నీరజ ప్రతిమమైన ముఖంబున పండు వెన్నియల్ చారుతర ప్రచారగతి సాప్తపదీనత జూపి సుస్మితో దార సుధాతరంగిణి విధంబున నర్తన సేయ సత్కృపా శారద; శారదా జనని సన్మతి యేలుత  నిల్చి ఈసభన్ తల్లి దండ్రులకు, గురుపరంపరకు, సభా సదులకు నమస్సులు. ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని. అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు. ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు. 1) స్వాయంభువు, 2) స్వారోచిషుడు 3) ఉత్తముడు 4) తామసుడు 5) రైవతుడు 6) చాక్షసుడు 7) వైవస్వతుడు 8) సూర్య సావర్ణి. ఇతడే బలి చక్రవర్తి 9) మేరు సావర్ణి 10) కక్ష్య సావర్ణి 11) రుద్ర సావర్ణి 12) ఇంద్ర సావ

🚩 వేమన్న వేదం🌹🌹

Image
🚩 వేమన్న వేదం🌹🌹 👉🏿🙏🏿🙏🏿 *సుగుణవంతురాలు సుదతియై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారి కింకను విశ్వదాభిరామ వినుర వేమ!* 👉🏿 భార్య అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతే ఇంటిని మించిన స్వర్గం లేదు. సంసారాన్ని మించిన చక్కని యోగం మరొకటి లేదు. మన వేదాంతులు మంత్రయోగం, హఠయోగం, రాజయోగం, లయయోగం అనే నాలుగు యోగాలను చెప్పారు. వీటికి భిన్నమైన సంసారయోగాన్ని వేమన్నగారు బోధిస్తున్నారు. 👉🏿 “వెతలు దీర్చువాడు వేదాంతవేద్యుండు రతుల నేలువాడు రమణుడగును సతిని బెనగువాడు సంసార యోగిరా!” అని నిర్వచించారు. ఈ యోగం ముందు మిగతావి దిగదుడుపే; నిష్ప్రయోజనాలే !! యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే హఠయోగ సాధనాలలో, యమ నియమాలను తప్ప మిగతా వాటిని కసరత్తుగానే వేమన్నగారు భావించారు. “ఆసనము పన్ని అంగంబు బిగియించి యొడలు విరుచుకోనేడు యోగమెల్ల జెట్టిసాము కన్నా చింతాకు తక్కువ” అని నిస్సంకోచంగా నిందించారు. యోగులమని చెప్పుకొనే వాళ్ళలో సైతం భోగలాలసత్వం కనబడుతుందని చెబుతూ - “వేషభాష లెరి

🚩కామాఖ్య దేవాలయము-గౌహతి .ఆస్సాం .🙏🏿🙏🏿

Image
🚩కామాఖ్య దేవాలయము-గౌహతి .ఆస్సాం .🙏🏿🙏🏿 (నేను ఇటీవల దర్శనం చేసుకొన్న పుణ్య క్షేత్రం .) 👏🏿👏🏿కామాఖ్యా అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచల పర్వత శిఖరం పై సతీ దేవి యొనిభాగం పడిందని ప్రతీతి. నీలాచలంలోని గర్భగుడిలో యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు. 🌺🌺 కామాఖ్య దేవాలయం (కాంరూప్-కామాఖ్య) కామాఖ్యాదేవి కొలువైన ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనది. ఇది భారతదేశంలోని అస్సాం నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయము. కాళికా పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది, మరియు ఈ స్థలం, శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు, ఆమె యోని పడిపోయిన స్థలం కూడా. 108 స్థలాలలో సతీదేవి శరీరానికి అనుబంధము ఉందని పేర్కొన్

🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹

Image
🌺🌹జయదేవ బృందావనం(అష్ట పది )🌺🌹 🚩మామియం చలితా రాధా విరహంలో బాధపడుతున్న కృష్ణుని ఈ అష్టపదిలో మనం చూడవచ్చు. ఆ విరహంలో కృష్ణుని వేణుగానం మాటలుగా మారి మనలిని అలరిస్తుంది. మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన సాపరాధతయా మయాపి న వారితాతిభయేన హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన తాత్పర్యం నా చుట్టూ స్త్రీల గుంపు ఉన్నారు. రాధాదేవి చూడగూడని స్థితిలో బృందావనంలో నన్ను చూసింది. హృదయం కదిలిపోయి ఉంటుంది. నేరం చేసిన వాడిని కాబట్టి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళుతున్న ఆమెను ఆపలేకపోయాను. కటకటా! ఆ రాధ కోపాన్ని పొంది ఆదరణ లేకుండా వెళ్ళిపోయింది. విశేషం తప్పు చేసానని ఒక పక్క ఒప్పుకొంటున్నాడు. మరో పక్క రాధ ఆదరణ లేకుండా వెళ్ళిందంటున్నాడు. చాలా తమాషా నేరం ! ఇది భావ చమత్కారం .హరి (కృష్ణుడు) 'హరిహరీ’ అనుకోవటం శబ్ద చమత్కారం 🚩కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ హరి! హరి! హతాదరతయా గతా సా కుపితేన తాత్పర్యం ఆ రాధ చాలాకాలం నా విరహంతో ఉన్నది. నా విరహం పోగొట్టుకోవడానికి ఏమి చేస్తుంది?. ఏమి చెబుతుంది? ఆ రాధ లేకపోత

🚩 చనిపోవడమంటే !!!

Image
🚩 చనిపోవడమంటే !!! 👏🏿👏🏿👏🏿👏🏿 చావుగురించి ఆలోచించడం, భయపడడం రెండూ వ్యర్ధమే! 👇💥👇 👉🏿ముందు చనిపోవడమంటే ఏమిటో తెలిస్తే, ఎక్కడికెడతామనే విషయం ఇట్టే అర్ధమౌతుంది. సమాజంలో "మరణం" అనే అంశంచుట్టూ రకరకాల అభూతకల్పనలు ప్రచారంలో వున్నాయి. స్వర్గం-నరకం, దేవుడు-దయ్యం, పాపం-పుణ్యం, ఆత్మ-పరమాత్మ ఇలాంటి పదాలన్నీ వొట్టి కల్పన! ఇదంతా మానవుడి ఊహే తప్ప, ఇలాంటివేవీ లేవు. ఉండటానికి అవకాశమేలేదు. మానవదేహం కూడా అచ్చంగా వొక మెషీన్ లాంటిది. లాంటిదేమిటి? మన దేహం అక్షరాలా వొక బయో మెషీన్. జీవక్రియలు ఆగిపోయినపుడు, ఇదీ పనిచేయడం మానేస్తుంది. దేహంనుండి బయటికొచ్చే ఆత్మల్లాంటివేవీ వుండవు. తరువాత మనకు తెలిసేది, తెలుసుకునేదీ ఏదీ వుండదు. బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయినపుడు, ఇక మెమరీ కూడా బందే! ఇక దేహం కూడా మట్టిలో కలిసిపోతుంది. అంతటితొ కథ ముగుస్తుంది! కానీ, నిజానికి ప్రాణులకు మరణం వుండదు. ఎందుకంటే, ప్రతీ ప్రాణీ తనలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా తనలాంటి మరొజీవికి ప్రాణ ప్రతిష్టచేసి, తరువాత, నశించిపోతుంది. కాబట్టి, తల్లి

🚩తోలుబొమ్మలాట !🌹🌹

Image
🚩తోలుబొమ్మలాట !🌹🌹💥💥💥 తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది. తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు . తోలుబొమ్మలాటలో పాత్రలు తోలుబొమ్మలాట అంటే చా

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

Image
🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹 (బాలకాండ మందరమకరందం..సర్గ-49 💥💥 రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా, ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది. అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో "ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు . దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు. "ఓ రామా! ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య అహల్య. ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను అడిగాడు. తన భర్త వేషంలో వచ్చింది దేవేంద్రుడని అని తెలుసుకున్నది అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది. అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు. ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసాడు. జరిగిన విషయం గ్రహించాడు. "ఓ దుర్మతీ! నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకెదే న

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

Image
🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!! (టీకా ..భావం ) క కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్ గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్. టీకా: కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = క్రూరస్వభావము, పట్టుదల; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = పాతాళలోకపు; కుతల = భూలోక; భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా. భావము: మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు. 🚩 శా. నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే కీ

🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿

Image
🚩శుభం .-గజేంద్ర మోక్షము.👏🏿👏🏿 💥💥💥 🚩త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను. అతనికి దశలక్ష భార్యలు గలరు .అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతయు కలచివేసెను. ఆ చెరువులో పెద్దమొసలి యున్నది. అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనేను. ఏనుగు విదిల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు. లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయి యేండ్లు గడిచేను. స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజ్రు౦భి౦చెను.గజరాజునకు బలము సన్నగిల్లెను. మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించువా రెవ్వ రను కొనెను. పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను. అప్పుడు 💥శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోల౦బయ్యె ప్రాణ౦బులున్ ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చే,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవేతప్ప నిత:పరం బెరుగ, మన్నింప పందగుం దీనునిన్ రావే! యీశ్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా! అని మొరపెట్టుకొనెను. 💥💥💥

🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩

Image
🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం . “ నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను. ‘నన్ను మఱచిన యెడలన్ మఱతును.’ ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా నన్నే నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను. ‘యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని ’ వారిని కాపాడతానంటాడు పరమాత్మ. తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని “ స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130). " నీవే తప్పనిత: పరంబెరుగన " నే ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది. అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది . అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి. ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ” ప్రబలమైన విష్ణుభక్తి