Posts

Showing posts from July, 2021

🔴 -గరుత్మంతుడు -🔴

Image
♦ 🔴  -గరుత్మంతుడు -🔴 ♦కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి.  ♦వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు. ♦వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. మరో 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ...  ఆ అండం నుంచి  గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి, భక్తిగా తల్లికి నమస్కరించాడు. వినత సంతోషంగా కుమారున

🚩డాక్టర్ -దేవుడు!

Image
 🚩డాక్టర్ -దేవుడు! ♦అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. ఆళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు. ♦కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు. ♦రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు. ♦బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత '

మేఘ సందేశం 🚩 (మహాకవి కాళిదాసు!)

Image
🚩 👉🏿కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. 👉🏿ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. 👉🏿కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 👉🏿 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు. 👉🏿అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం, 👉🏿'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం, 👉🏿'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు. 👉🏿 నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు 'అ