మేఘ సందేశం 🚩 (మహాకవి కాళిదాసు!)



🚩

👉🏿కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట.

అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు.

👉🏿ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట.

అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని.

👉🏿కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని

👉🏿 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు

పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట.

ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు

మొదలెట్టేసి రాసేసాడు.

👉🏿అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...'

అంటూ కుమారసంభవం,

👉🏿'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..'

అంటూ మేఘ సందేశం,

👉🏿'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...'

అంటూ రఘు వంశం రాసేసాడు.

👉🏿 నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు

నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు

కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్రకారులు

ఒప్పుకోకపోయినా, భాషాభిమానులు, భక్తి పారాయణులు 'అద్భుతం..' అనకుండా ఉండలేరు.

👉🏿ఆ కావ్యాల్లో చిన్నది, విరహ శృంగార రస ప్రధానమైనది మేఘసందేశం.

👉🏿ఇది మొత్తం రెండు సర్గల కావ్యం.

మొదటి దాంట్లో 67 శ్లోకాలు ఉంటే రెండో దాంట్లో 57 ఉంటాయి.

అంటే మొత్తం 124 శ్లోకాల కావ్యం అన్నమాట.

కావ్యం అంతా ఒకటే వృత్తం- మందాక్రాంత.

👉🏿చాలా మందికి 'శాంతాకారం భుజగ శయనం పద్మ నాభం సురేశం..' అనే ప్రసిధ్ధ శ్లోకం తెలిసే ఉంటుంది..

ఈ కావ్యం మొత్తాన్ని ఆ నడకలో చదువుకోవాలి..

👉🏿భారత దేశంలో పుట్టినందుకు పోయేలోపు ఒక్క కావ్యమన్నా చదివి ఆస్వాదించాలనే తృప్తికోసమైనా ఈ మేఘసందేశం చదివి తీరాలి.

నిజానికి ఇదొక్కటీ ఆస్వాదిస్తూ చదివితే మరికొన్ని కావ్యాలు చదవాలనే కొరిక కలగొచ్చు.

👉🏿కూబేరుని శాపం వల్ల భార్యకు దూరమైన ఒక యక్షుడు

మేఘంతో చేసేతన విరహ సంభాషణే ఈ కావ్య వస్తువు.

మేఘంతో సంభాషనేమిటి అర్థం లేకుండా అని అనుకుంటూ

ఉండే లోపే5 వ శ్లోకంలోనే 'ధూమజ్యోతి సలిల మరుతా...'

అంటూ విరహ బాధలో ఉన్నప్పుడు సాధ్యాసాధ్యాల బేరీజు వెసుకోవడం, ఇంగితం వంటివి ఉండవని చెబుతాడు కాళిదాసు.

ఇక అక్కడి నుంచి నాయకుడైన యక్షుని మనఃస్థితిని

అర్థం చేసుకుని తక్కిన కావ్యం సందేహాలు లేకుండా చదివేయొచ్చన్నమాట.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!