🚩 వేమన్న వేదం🌹🌹

🚩 వేమన్న వేదం🌹🌹


👉🏿🙏🏿🙏🏿


*సుగుణవంతురాలు సుదతియై యుండిన


బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప


స్వర్గమేటికయ్య సంసారి కింకను


విశ్వదాభిరామ వినుర వేమ!*


👉🏿

భార్య అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతే ఇంటిని మించిన


స్వర్గం లేదు. సంసారాన్ని మించిన చక్కని యోగం మరొకటి లేదు.


మన వేదాంతులు మంత్రయోగం, హఠయోగం, రాజయోగం,

లయయోగం అనే నాలుగు యోగాలను చెప్పారు.


వీటికి భిన్నమైన సంసారయోగాన్ని వేమన్నగారు బోధిస్తున్నారు.


👉🏿


“వెతలు దీర్చువాడు వేదాంతవేద్యుండు


రతుల నేలువాడు రమణుడగును


సతిని బెనగువాడు సంసార యోగిరా!”


అని నిర్వచించారు. ఈ యోగం ముందు మిగతావి దిగదుడుపే;


నిష్ప్రయోజనాలే !!


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ,


సమాధులనే హఠయోగ సాధనాలలో, యమ నియమాలను

తప్ప మిగతా వాటిని కసరత్తుగానే వేమన్నగారు భావించారు.


“ఆసనము పన్ని అంగంబు బిగియించి


యొడలు విరుచుకోనేడు యోగమెల్ల


జెట్టిసాము కన్నా చింతాకు తక్కువ” అని నిస్సంకోచంగా నిందించారు.


యోగులమని చెప్పుకొనే వాళ్ళలో సైతం భోగలాలసత్వం కనబడుతుందని


చెబుతూ -


“వేషభాష లెరిగి కాషాయ వస్త్రాలు


కట్టగానే ముక్తి కలుగబోదు


తలలు బోడులైన తలపులు బోడులా?” అని ప్రశ్నించారు.


కామం మానవ నైజం, సంసారానికి ఈ తృతీయ పురుషార్ధం ప్రాణం.


అందుకే –


“కామి గానివాడు కవి కాడు, రవి కాడు


కామి గాక మోక్షగామి కాడు


కామియైనవాడే కవియౌను రవియౌను”


అని తేటతెల్లం చేసారు. త్రిమూర్తులంతవాళ్ళే ఆడదాన్ని


వదలలేకపోయారని –


“పడతి మోసె నొకడు, పడతి మేసె నొకడు


పడతి నెదను బట్టి బ్రతికెనొకడు


పడతి కొరకు నిట్లు పలుపాట్లు పడిరయా!”


అని -

గంగను శిరస్సున ధరించిన శివుడిని,


సరస్వతిని నాలికపై ఉంచుకున్న బ్రహ్మనీ,


లక్ష్మీదేవిని హృదయమున నింపుకున్న విష్ణుమూర్తినీ


ఉదాహరణగా చెప్తూఆలి అవసరాన్ని తెలియజేశారు.


🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿🧚‍♂️🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!