కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

CORRECT
ReplyDeleteభరించలేని
Deleteబాధలోవున్నప్పుడు
బావుంటుంది వస్తే అనిపిస్తుంది
మనసంతా
సంతోషంతో వున్నప్పుడు
వస్తుందంటే బాధేస్తుంది.
వస్తున్నప్పుడు భయమేస్తుంది
చెప్పకుండావచ్చేస్తే..
చచ్చినోళ్ళకి ఎట్లున్నా
బంధాలతోమిగిలిఉన్నోళ్ళను బాధిస్తుంది
బలవంతంగా అనుభవించటం నేరం
లేదు ఎవరికీ అటువంటి అధికారం
అదిస్వార్థం మోసం ఘోరం
ఫలితం భరించేది బ్రతికిన మమకారం
గాదిరాజు మధుసూదన రాజు
మరణం
ReplyDelete-------
భరించలేని
బాధలోవున్నప్పుడు
బావుంటుంది వస్తే అనిపిస్తుంది
మనసంతా
సంతోషంతో వున్నప్పుడు
వస్తుందంటే బాధేస్తుంది.
వస్తున్నప్పుడు భయమేస్తుంది
చెప్పకుండావచ్చేస్తే..
చచ్చినోళ్ళకి ఎట్లున్నా
బంధాలతోమిగిలిఉన్నోళ్ళను బాధిస్తుంది
బలవంతంగా అనుభవించటం నేరం
లేదు ఎవరికీ అటువంటి అధికారం
అదిస్వార్థం మోసం ఘోరం
ఫలితం భరించేది బ్రతికిన మమకారం
గాదిరాజు మధుసూదన రాజు