కొత్త అమ్మ....పాత అమ్మ.!


కొత్త అమ్మ....పాత అమ్మ.!
.
ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది..
కానీ వాళ్ళ నాన్న మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు..
.
ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఒరేయ్ బాబు నీకు కొత్త అమ్మ , చనిపోయిన పాత అమ్మ మద్య ఏం తేడా అనిపించిందిరా అని అడిగాడు....
.
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు..
.
నాన్న కొత్త అమ్మ నిజం.. పాత అమ్మ అబద్ధం అన్నాడు..
.
అది విన్న తండ్రి అవాక్కయి..అదేంటి బాబు అలా అంటున్నావ్ అంటే..
.
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.
.
.
నేను ఎపుడైనా అల్లరి చేస్తే అప్పుడు మా అమ్మ అనేది నువ్ ఇలాగె అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టాను అని..
.
అయిన నేను అల్లరి చేసేవాడిని..కానీ ఆ అమ్మ నన్ను లాక్కొని వెళ్లి తన దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది..
.
కాని ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేసావంటే నీకుఅన్నం పెట్టను అంది ..
.
కానీ ఈ కొత్త అమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న..
.
అందుకే ఆ పాత అమ్మ అబద్ధం .. ఈ కొత్త అమ్మ నిజం.
.
ఇది విన్న ఆ తండ్రి నోట్లో నుండి మాటరాలేదు.....!
ఎన్ని డబ్బులు ఇచ్చిన అమ్మ ప్రేమ దొరకదు..!!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!