లోకులు కాకులు !


లోకులు కాకులు ,
గుంపుగా అరవటం తప్ప ఆలోచన ఉండదు ,"M.F.

( నీవు ఎన్నుకున్న మార్గం సరైనదైతే ఈ కాకుల గోల విననవసరం లేదు )
శ్రీమతి...Meraj Fathima..

లోకులు కాకులు!
కాకిని.

ఏ కాకిని?
ఏకాంత లోకపు ఏకైక కాకిని.

ఎక్కడా లోకం?
మదిలొ ఓ గదిలొ.

ఎందుకా గది?
కాకులకు, లోకులు కాకులు. శోక మూకలు.
వాటి కేకలకు లేవు బ్రేకులు.
అందుకే,
నావి కాక ఏ కాకి కేకలకు నా మదిలోని ఈ గదిలోకి లెవు రాక పోకలు.

ఏమైంది ఆ కేకలకు?
కావు కావు మని గావు కేకలు.
ఆ కేకలు నాకోసం కావ్!
ఆ కాకులు నాకు ఎమీ కావ్! కావ్! కావ్!

నేను కాకిని కానూ? నావి కేకలు కావూ?
అవును కదా. ఇప్పుడె కావు కావు మన్నా కూడా!
అయ్యూ! confusion గా ఉంది.
ఎదైన కాకి దొరికితె బాగుండు,
కాస్త నా బాద పంచుకోవచ్చు.
అయ్యయ్యొ! నా మదిలొ ఈ గదిలొ నేను కాక ఏ కాకీ లెదే!
నెను ఏ కాకికీ ఎమీ కాకుండా పోయింది నేను కట్టుకున్న గొడల వళ్ళెన?

కాకిని.

ఏ కాకిని?
ఏ కాకి కాకిని?
ఏకాకిని.
ఏకాకి కాకిని.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!