చిట్టిబొట్టు నోము.

చిట్టిబొట్టు నోము.
ఈ నోము పట్టిన బాల ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలదువ్వి జడవేసుకొని, స్నానంచేసి, ఉతికి ఆరవేసిన మడిబట్టలు కట్టుకుని, బొట్టూ కాటుకా పెట్టుకొని పసుపూ, గంధంపూసుకొని, అక్షితలు పట్టుకొని 'చిట్టిబొట్టు .... చేపట్టవలె' అని కథ చెప్పుకొని అక్షతలు పైన వేసుకోవాలి. తరువాత అయిదుగురు ముత్తైదువలకు పసుపురాసి, కుంకం బొట్టుపెట్టి, గంధంరాసి, బొట్టుకు క్రిందుగా గంధంచుక్క పెట్టి, దానిపై రెండు అక్షితలు అంటించి, అక్షితలు వారి చేతిలో పెట్టి, పాదాలకు మ్రొక్కి అక్షితలు తలపై వేయించుకొని వారి దీవెనలు పొందుతారు.స్వీకరణ---
గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు,(1991)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!