నారాయ‌ణ‌రావు న‌వ‌లా - అడ‌వి బాపిరాజు ఉప్పొంగి పోయింది గోదావరి ! తాను తెప్పున్న ఎగిసింది గోదావ‌రి


నారాయ‌ణ‌రావు న‌వ‌లా - అడ‌వి బాపిరాజు

ఉప్పొంగి పోయింది గోదావరి ! తాను
తెప్పున్న ఎగిసింది గోదావ‌రి !

కొండల్లొ ఉరికింది
కోన‌ల్లు నిండింది
ఆకాశ‌గంగ‌తో
హ‌స్తాలు క‌లిపింది || ఉప్పొంగి ||

అడ‌వి చెట్ల‌న్నీని
జ‌డ‌ల‌లో తురిమింది,
ఊళ్లు దండ‌ల‌గుచ్చి
మెళ్లోన తాల్చింది || ఉప్పొంగి ||

వ‌డుల‌లో గ‌ర్వాన‌
న‌డ‌ల‌లో సుడుల‌లో
ప‌ర‌వ‌ళ్ళు తొక్కుతూ
ప్ర‌వ‌హించి వ‌చ్చింది || ఉప్పొంగి ||

శంఖాలు పూరించి
కిన్నెర‌లు మీటించి
శంక‌రాభ‌ర‌ణ‌రా
గాలాప కంఠియై || ఉప్పొంగి ||

న‌ర‌మాన‌వుని ప‌నులు
శిర‌మొగ్గి వ‌ణికాయి
క‌ర‌మెత్తి దీవించి
క‌డ‌లికే న‌డ‌చింది || ఉప్పొంగి ||

వ‌ర‌ద స‌మంలో సుడుల వ‌డుల‌తో నుడిగ‌ళ్ళు త్రొక్కే గోదావ‌రీ న‌దీమ త‌ల్ఇ యొక్క గ‌తి విశేషాల‌ను త‌ల‌పింప‌జేసే ఈ ముగ్థ సుకుమార సుంద‌ర ప‌ర స‌మంచిత గేయాన్ని చ‌దివినా, విన్నా, అడివి బాపిరాజుగారు స‌ర‌ప సాహితీ సంస్కార స‌మ పేతుల స్మృతి ప‌థాల‌కు ఆ ప్ర‌య‌త్నంగా వ‌చ్చి, స‌హృద‌య హృద‌య‌కేరాదాల‌లో ప్ర‌తిభా పూర్వ‌క విన్యాసాలు సాగిస్తారు. ఆయ‌న అక‌లుష‌జీవితం చాలావ‌ర‌కు ఆ పావ‌న గోదావ‌రీ జ‌ల‌ప్ర‌వాహ‌ముతో పెన‌వేసుకొని పునీత‌మైన‌ది. ఆయ‌న ఉత్సాహ శ‌క్తికి, క‌ళామ‌య భావ‌న‌ల‌కు, శారీర‌క మాన‌సిక ప‌టిమ‌ల‌కు, విద్యా వివేక సంప‌త్తికి ర‌మ‌ణీయ ర‌చ‌నాపాట‌వానికి, ఆ న‌దీమాత‌యే ముఖ్యావ‌లంబ‌మైన‌ది. ఆయ‌న క‌మ‌నీయ క‌వితావిన్యాసాల‌కు చైత‌న్యాత్మ‌క చిత్ర‌క‌ళా వైద‌గ్థ్యానికి, శ్రావ్వ‌గాన ప‌ణితుల‌కు ఆపావ‌న‌వాహినియే ప్రేరక‌మైన‌ది. ఆ చ‌ల్ల‌ని జ‌ల‌ముచే త‌డిసిన అడ‌వి ఒక‌నాడు వారి వంశానికి ఆట‌ప‌ట్టైంది.
.
అడివి బాపిరాజుగారు 08-10-1895 తేదీన పుణ్య దంప‌తులైన సుబ్బ‌మ్మ‌, కృష్ణ‌య్య‌గార‌ల‌కు ప‌శ్చిమ గోదావ‌రీ మండ‌లంలో గ‌ణ‌ప‌వ‌రానికి ప్ర‌క్క‌నేయున్న స‌రిప‌ల్లె గ్రామంలో పుట్టి, సోమేశ్వ‌రాధి ష్టిత భీమ‌వ‌ర ప‌ట్ట‌ణంలో బాగా ఎదిగినారు. ఉన్న‌త విద్యాభ్యాసం చేసే స‌మ‌యంలో రాజ‌మండ్రీ ప్ర‌భుత్వ క‌ళాశాల యంద‌లి కూల్డ్రే దొర‌గారి శిష్యులై, సంగీత‌, చిత్ర క‌ళాభిమాన‌ముల‌ను పెంపొందించుకొనినారు. మచిలీప‌ట్ట‌ణంలోని ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌లో ప్ర‌మోద కుమార ఛ‌ట‌ర్జీగారి శిష్యులుగా వుంటూ అనేక చిత్ర‌క‌ళార‌హ‌స్యాల‌ను ప‌రిగ్ర‌హించారు. మ‌ద్రాసు న‌గ‌రంలో బి.య‌ల్‌. ప‌ట్టాన్ని స్వీక‌రించి, భీమ‌వ‌రంలో న్యామ‌వాద వృత్తి చేప‌ట్టినా, అది ఆయ‌న స‌హ‌జ క‌ళాసాస‌కు త‌గ‌నిద‌గుట‌చే, దానిని ప‌రిత్య‌జించినారు. చిన్న త‌నంలోనే జాతీయ‌భావాల‌ను ఏర్ప‌రుచుకొని, జాతీయోద్య‌మంలో పాల్గొని, ఒక సంవ‌త్స‌రం కార‌గార శిక్ష‌ను అనుభ‌వించిన గాంధేయ‌వాది. కొంత కాల‌ము అధ్యాప‌క వృత్తిని కూడ నిర్వ‌హించినారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!